‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ డోస్ (టీజర్)కు అనూహ్యమైన స్పందన వచ్చింది. సెకండ్‌డోస్ లో భాగంగా విడుదల చేసిన ఈ సినిమాలోని అరెరె.. అరెరె అనే లిరికల్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. మార్చి 22న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ నలుగురు స్నేహితుల కథ ఇది. వారి స్నేహం, ప్రేమ, వారి లైఫ్ జర్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం. నేటి యువతరాన్ని అమితంగా ఆకట్టుకునే ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో కుటుంబ ప్రేక్షకులను అలరించే భావోద్వేగాలు కూడా వున్నాయి. అభిరుచి గల నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌తో కలిసి సృజన్ కుమార్ బొజ్జం ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు.తప్పకుండా ఈ చిత్రం యూత్‌కు ఓ ఫెస్ట్‌లా వుంటుంది* అన్నారు.
ఇక సినిమా టైటిల్ విషయానికి వస్తే సినిమా ఎలా ఉన్నా కూడా టైటిల్స్ కూడా ఈ మధ్య వెరైటీగా పెడుతున్నారు. ఏదో ఒక పదంతో యూత్‌ని ఆకట్టుకుని థియేటర్లకు రప్పిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రోటీ..కపడా..మకాన్ అని అంటారు. కానీ వెరైటీగా రోటి.. కపడా.. రొమాన్స్ అంటూ యూత్ ఎట్రాక్ట్ అయ్యే విధంగా ఈ టైటిల్‌ని పెట్టారు. ఇక కథ విషయానికివస్తే ఓ పక్క యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అంటూనే మరో పక్క కుటుంబ భావోద్వేగాలు ఈ చిత్రంలో ఉన్నాయంటున్నారు. మరి ఇటీవల వచ్చే చిత్రాలు ఫుల్ ఫ్యామిలీ కలిసి చూసే చిత్రాలు చాలా తక్కువనే చెప్పాలి మరి ఈ చిత్రం పెద్దలను ఏ విధంగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.