సాతులూరులో రూ. 1.20 కోట్లతో అభివృద్ధి పనులు

సాతులూరు, మహానాడు: నాదెండ్ల మండలం, సాతులూరు గ్రామంలో రూ. 1.20 కోట్లతో రోడ్లు, సైడ్ డ్రైన్స్ కు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను శనివారం నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు, చిలకలూరిపేట శాసన సభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు నిర్వహించారు. గ్రామంలో రూ. 40 లక్షలతో రోడ్లు, రూ. 80 లక్షలతో రోడ్లు, డ్రైన్స్ నిర్మించనున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటికి ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందని వారు పేర్కొన్నారు.