-పోలీసులు అంటూ రూ.1.20 లక్షలు దోచుకున్నారు
పోలీసులమంటూ బెదిరించి రూ. 1.20 లక్షలు దోచుకెళ్లిన వైనంపై నిన్న కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… గుంటూరు చెందిన సురేష్ కొత్తపేట శీలంవారి వీధిలో బట్టలు మరియు ఆన్లైన్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన దుకాణానికి నలుగురు వ్యక్తులు వచ్చి తాము పోలీసులమని చెప్పారు. ఆన్లైన్లో అధిక ధరలకు బట్టలు అమ్ముతున్నావని ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. సీఐ తీసుకురమ్మన్నారంటూ దుకాణంలో తనిఖీలు చేస్తూ హడావుడి చేశారు. వీడియోలు, ఫొటోలు కూడా తీశామని, రూ.5 లక్షలు డబ్బులు ఇస్తే కేసు లేకుండా, పేపరులో వేయకుండా చేస్తామని బెదిరించారు. దుకాణంలో ఉన్న రూ.1.20 లక్షలు తీసుకొని వెళ్లిపోయారు. మరో రూ. 30 వేలు ఇవ్వ మంటూ ఫోన్ చేసి బెదిరిస్తున్నారని , డబ్బులు తీసుకొని మోసగించిన నకిలీ పోలీసులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కొత్తపేట సీఐ వీరయ్య తెలిపారు.