రూ. 13,35,450 విలువ గల పశుదాణా పంపిణీ

– సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్

కొల్లూరు, మహానాడు: కృష్ణానది వరద నీరు బాగా పెరిగి కృష్ణా బ్యారేజి దిగువున ఉన్న లోతట్టు ప్రాంతాలైన కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె ప్రాంతాల్లోని గాజుల్లంక, పెసర్లంక, పెదలంక, చింతల్లంక, ఈపూర్లంక, సుగ్గుంలంక, చిలుముర్లంక, కనిగిర్లంక, అన్నవరపులంక, కొత్తూర్లంక పంట పొలాలు వరద ముంపునకు గురయ్యాయి. దీంతొ పశువులమేతకు బాగా ఇబ్బంది ఏర్పడింది. పశుగ్రాస కొరతను దృష్టిలో ఉంచుకొని సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పాడిరైతులకు సంగం డెయిరీ నుండి రూ. 13,35,450 ల విలువ గల పశుదాణాను రైతులకు పంపిణీ చేశారు.

ఓలేరు బీఎంసీ పరిధిలో భట్టిప్రోలు మండలంలోని 11 గ్రామాల్లోని 436 మంది పాడి రైతులకు, రేపల్లె మండలంలో 2 గ్రామాల్లోని 150 మంది పాడి రైతులకు, కొల్లూరు మండలంలోని 4 గ్రామాల్లోని 213 మంది పాడి రైతులకు, చల్లపల్లి మండలంలోని ఆముదార్లంక గ్రామంలోని 39 మంది పాడి రైతులకు, జంపని బీఎంసీ పరిధిలో కొల్లూరు మండలంలోని 10 గ్రామాల్లోని 371 మంది పాడి రైతులకు, కొల్లిపర మండలంలో పాతబొమ్మువారిపాలెం గ్రామంలో 29 మంది పాడి రైతులకు, ఉంగుటూరు బీఎంసీ పరిధిలో తుళ్ళూరు మండలం హరిశ్చంద్రాపురం గ్రామంలోని 42 మంది పాడి రైతులకు, అలాగే అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, చావపాడు గ్రామాల్లోని 225 మంది పాడి రైతులకు మొత్తం 58 టన్నుల పశుదాణాను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో సంబంధిత పాలకవర్గ సభ్యులు నర్రా వెంకట కృష్ణ ప్రసాద్, జ్ఞానానంద భగవాన్, వలివేటి ధర్మారావు, కంచర్ల శివరామయ్య, సంగం డెయిరి పి అండ్‌ ఐ. జి.ఎం . కొల్లి వేంకటేశ్వర ప్రసాద్, మేనేజర్లు పాతూరి ఆదినారాయణ, గోపి పాల్గొన్నారు. రైతు సేవలో ఎప్పుడూ సంగం డెయిరీ ముందు ఉంటుందని ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ తెలిపారు.