ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చొరవతో వ్వవ్వేరు గ్రామానికి ఆర్ టి సి బస్సు

– ముఫ్ఫై ఏళ్ళ తరువాత వవ్వేరు గ్రామానికి ఆర్ టి సి బస్సు సౌకర్యం
– స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న వవ్వేరు వాసులు

వవ్వేరు: విద్యార్దులైతే థాంక్స్ ప్రశాంతి మేడం అంటూ అభినందనలు. ఎమ్మెల్యే ప్రశాంతమ్మ సల్లగుండాల ఆ తల్లి దయతో మా ఊరికి బస్సొచ్చిందంటూ గ్రామస్థుల కృతజ్ఞతలు. ముఫ్ఫై ఏళ్ళ నుంచి బస్సు సొకర్యం లేని వవ్వేరు గ్రామంలో ఆర్ టి సి బస్సు హారన్ మోగడంతో వవ్వేరు వాసుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

బుచ్చిరెడ్డిపాళెం సమీపంలోని వవ్వేరు గ్రామానికి గత ముఫ్ఫై సంవత్సరాలుగా బస్సు సౌకర్యం లేదు. గ్రామస్థుల ఆటోల పై ఆధారపడి రాకపోకలు సాగించేవారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తమ గ్రామానికి ఆర్ టి సి బస్సు సౌకర్యం కల్పించమని వవ్వేరు వవ్వేరు వాసులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి మొరపెట్టుకున్నారు.

కోవూరు ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఎన్నికల హామీలు ఒక్కోకకటిగా నెరవేర్చే క్రమంలో వవ్వేరు గ్రామానికి బస్సు సౌకర్యం లేని విషయాన్ని ఆర్ టి సి ఉన్నతధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. వెంటనే స్పందించిన రాష్ట రోడ్డు రవాణా సంస్థ అధికారులు వవ్వేరు నుంచి బుచ్చిరెడ్డిపాళెంబ పట్టణానికి బస్సు సౌకర్యం కల్పించారు.

వవ్వేరు టు బుచ్చిరెడ్డిపాళెం పట్టణానికి బస్సు సర్వీసు ప్రారంభమైన నేపధ్యంలో బుచ్చిరెడ్డిపాళెం తెలుగుదేశం పార్టీ రూరల్ మరియు అర్బన్ మండల అధ్యక్షులు బత్తుల హరికృష, ఎం వి శేషయ్య గార్ల ఆధ్వర్యలో స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.

రాజకీయ నాయకుల హామీలు నీటి మీద రాతలుగా మారిన ఈ రోజుల్లో చేసిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ఎమ్మెల్యే పదవికే వన్నె తెస్తున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట తప్పని పనితీరును వవ్వేరు వాసులు కొనియాడుతున్నారు.

నెల్లూరు డిపో-1 మేనేజర్ మురళి గారికి ధన్యవాదాలు తెలిపారు. వవ్వేరు టు బుచ్చిరెడ్డిపాళెం బస్సు సర్వీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాళెం తెలుగుదేశం పార్టీ రూరల్ మరియు అర్బన్ మండల అధ్యక్షుడు బత్తుల హరికృష, ఎం వి శేషయ్యలతో పాటు స్థానిక టిడిపి నాయకులు మాజీ సర్పంచ్ చిరమన ఆంజనేయులు,జొన్నలగడ్డ శివప్రసాద్, రాజేశ్వరమ్మ, బచ్చేభాయ్, హరనాద్, తాల్లస్వామి, ప్రభాకర్, చిరమన వంశి, కంచర్ల మురళి చౌదరి, వెంకటేశ్వర్లు నాయుడు, జొన్నలగడ్డ వరలక్ష్మి, షేక్ షబ్బీర్ , షేక్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు