ఏపీలో టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ శుభవార్త

– పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం

విజయవాడ: పదో తరగతి విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరిగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. పరీక్ష హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రాలకు వెళ్లొచ్చని తెలిపింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొంది.