అభివృద్ధి బాటలో పల్లెలు

– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి, మహానాడు: ఎన్డీయే సర్కారు పాలనలో పల్లెలు అభివృద్ధి బాట పడుతున్నాయని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.  పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సత్తెనపల్లి రూరల్ మండలం, కట్టావారిపాలెం గ్రామంలో రూ.15 లక్షలు, కంటెపూడి గ్రామంలో రూ.20 లక్షలు, భీమవరం గ్రామంలో రూ.8 లక్షల రూపాయలతో నిర్మించనున్న కాలువలు, రోడ్ల పనులకు సోమవారం శంకుస్థాపన చేసి, మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది. ఐదేళ్ల పాటు వైసీపీ విధ్వంస పాలన కొనసాగిన తర్వాత, మళ్ళీ మన పల్లెలు అభివృద్ధి బాట పడుతున్నాయి. గ్రామసభల్లో ఆమోదించిన 30 వేల పనులకు సంబంధించిన పనులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపారు.