మాచర్ల: నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్టు గేట్లు అధికారులు మరోసారి ఎత్తివేశారు. ఆరు గేట్లలను అయిదు అడుగుల మేర ఎత్తి 43 వేల క్యూసెక్కుల నీరు దిగువకు సోమవారం డ్యామ్ సీఈ నాగేశ్వరరావు విడుదల చేశారు. మొత్తంగా సాగర్‌కు 3,75,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ఇప్పటి వరకు మొత్తం 80,485 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ఇప్పటికి 581.70 అడుగులకు నీటి మట్టం చేరింది. ఇదిలావుండగా, సాయంత్రానికి ఎనిమిది నుండి 10 క్రస్ట్ గేట్లు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఇప్పటికే పోలీస్ శాఖ వారికి పలు సూచనలు చేశారు. అధికారుల ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ శాఖ పటిష్ఠ చర్యలు చేపట్టారు. స్థానిక మత్యకారులకు, పలువురు పర్యాటకులకు హెచ్చరికలు జారీ చేశారు.