రెండు నియోజకవర్గాల్లో ఓటుహక్కుకు దరఖాస్తు చేసినట్టు సజ్జలే ఒప్పుకున్నాడు

• క్యాంప్ క్లర్క్ సజ్జల అన్నీ తెలిసి కావాలనే రెండు చోట్ల ఓటు
• రెండు నియోజకవర్గాల్లో తనకు, తన కుటుంబసభ్యులకు ఓట్లు కావాలని దరఖాస్తులు పెట్టింది..వాటిపై సంతకాలు పెట్టింది సజ్జల ఆయన కుటుంబ సభ్యులు కారా?

• ఉద్దేశపూర్వకంగా తప్పు చేసింది కాక టీడీపీ వాళ్ల కళ్లు పచ్చగా ఉన్నాయని నోటికొచ్చినట్టు మాట్లాడితే సజ్జల సచ్ఛీలుడైపోడు
• టీడీపీ నేతల కళ్లు పచ్చగా ఉంటే, రామకృష్ణారెడ్డి వైసీపీనేతల కళ్లు నీలిరంగులో ఉండి నిజాలు చూడలేకపోతున్నాయా?
• దొంగగా దొరికాక కూడా తప్పు ఒప్పుకోకుండా టీడీపీపై నిందలేస్తే సరిపోతుందా?
• రెండు నియోజకవర్గాల్లో ఓటుహక్కుకు దరఖాస్తు చేసినట్టు సజ్జలే ఒప్పుకున్నాడు
• రెండు చోట్ల ఓట్లు పొందిన విషయం బయటకు పొక్కాకే జనవరి 31న ఒకచోట ఉన్న ఓట్లను డిలీట్ చేయాలని సజ్జల దరఖాస్తు పెట్టాడు.
• ఫామ్ – 6 ప్రకారం సజ్జల ఇచ్చిన సెల్ఫ్ డిక్లరేషన్ లోనే తప్పుడు సమాచారం ఇస్తే ఒక ఏడాది జైలుశిక్ష లేదా జరిమానా… వీలైతే రెండు శిక్షలు వేయొచ్చని ఉంది
• ఆయన ఇచ్చిన సెల్ఫ్ డిక్లరేషన్ లో పేర్కొన్న సెక్షన్ : 31.. రిప్రజంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ – 1950 ప్రకారం చర్యలు తీసుకోవచ్చు
• ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం సజ్జలకు ఒక ఏడాది జైలుశిక్ష. లేదా జరిమానా విధించాలి
• తప్పుడు సమాచారమిచ్చి రెండు నియోజకవర్గాల్లో ఓట్లు పొందిన సజ్జలపై కేంద్ర ఎన్నికలసంఘం కఠిన చర్యలు తీసుకోవాలి
• సజ్జల కుటుంబానికి రెండు చోట్ల ఓటు హక్కు కల్పించిన ఈఆర్వోలు, ఇతర సిబ్బందిపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం కఠినచర్యలు తీసుకోవాలి
• ఓటుకోసం తమవద్దకు వచ్చే సామాన్యుల్ని ముప్పుతిప్పలు పెట్టే అధికారులకు సజ్జల, ఆయన కుటుంబం చేసిన తప్పు కనిపించడం లేదా?
• సజ్జల రాష్ట్రంలో దొంగఓట్లు సృష్టిస్తుంటే, వై.వీ.సుబ్బారెడ్డి రాజధానులు మార్చేపనిలో ఉన్నాడు
– మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో జర్నలిస్ట్ గా వివిధ పత్రికల్లో పనిచేసి అంతిమంగా సాక్షి దినపత్రికలో ఎడిటోరియల్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తించి సుదీర్ఘ అనుభవం సంపాదించారని, అలాంటి వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి తర్వాత అత్యంత ఎక్కువగా అధికారం చలాయిస్తున్నారని, వైసీపీ సోషల్ మీడి యా ఇన్ ఛార్జ్ గా ఉన్న తన కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డితో కలిసి సజ్జల దొంగ ఓట్లు సృష్టించే బాధ్యత చేపట్టారని టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యు లు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికే సజ్జల టీడీపీపై నిందలేస్తున్నాడు
“ తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి నైతికత .. అనైతికత అని పెద్దపెద్ద మాటలు మాట్లాడుతూ టీడీపీపై నిందలేస్తున్నాడు. పొన్నూరు నియోజకవ ర్గంలో ఓటుహక్కు పొందడానికి 13-10-2023న ఆయన దరఖాస్తు చేసుకు న్నారు. ఆయన దరఖాస్తు బీఎల్వో దృష్టికి 04-11-2023న వచ్చింది. అదే రోజున బీ.ఎల్.వో మొత్తం వెరిఫై చేసి, 09-11-23 నాటికి సజ్జలకు ఓటు హక్కు కల్పించారు. ఆ తర్వాత వెంటనే ఆయనకు ఎపిక్ కార్డు అందించారు. ఈ వివరాలన్నీ ఆయన అధికారులకు అందించిన ఫామ్-6 రిఫరెన్స్ నంబర్ ప్రకారం ఆన్ లైన్లో పరిశీలిస్తే ఎవరికైనా కనిపిస్తాయి.

సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టుగానే ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు పొన్నూరు నియోజకవర్గంలో ఓటు హక్కు లభించింది. భారత ఎన్నికల సంఘం ప్రొఫార్మా ప్రకారం, ఫామ్-6కు లోబడి మొట్టమొదటిసారి తాను ఓటుహక్కుకు దరఖాస్తు చేస్తున్నట్టు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. తానిచ్చిన సమాచారం తప్పయి తే, అదే డిక్లరేషన్ లో పేర్కొన్న విధంగా సెక్షన్ : 31.. రిప్రజంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ – 1950 ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చినవారు ముమ్మా టికీ శిక్షార్హులే అవుతారు. సదరు సెక్షన్ ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చిన వారికి ఒక ఏడాది జైలుశిక్ష కానీ, జరిమానా గానీ లేదా రెండూ విధించవచ్చని ఫామ్-6 డిక్లరేషన్లోనే స్పష్టంగా ఉంది.

అలా చేయడం చట్టరీత్యా నేరమని సజ్జలకు తెలియదా?
ఇన్నివివరాలు స్పష్టంగా ఉంటే, పొన్నూరు నియోజకవర్గంలో ఓటుహక్కు పొందడానికి ముందే సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన సతీమణి శ్రీమతి లక్ష్మి, కొడుకు భార్గవ్ రెడ్డి, కోడలు దీపిక పేర్లతో ఫామ్-6 దరఖాస్తులు ఎవరు పెట్టారో సజ్జలే చెప్పాలి. ఫామ్-6 దరఖాస్తులు ప్రాసెస్ అయ్యి ఓటుహక్కు పొందాక, విషయం బయటకు పొక్కడంతో ఫామ్-7 దరఖాస్తు పెట్టారు. 13-10-2023న పొన్నూరు నియోజకవర్గంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న సోకాల్డ్ కుటుంబమే, 27-10-2023న మంగళగిరి నియోజకవర్గం పరిధిలో ఓటుహక్కు కావాలని మరలా దరఖాస్తు చేసింది. పొన్నూరు నియోజకవర్గ పరిధిలో ఫామ్-6 దరఖాస్తులు పెట్టిన సజ్జల కుటుంబం మరలా మంగళగిరి నియోజకవర్గంలో ఫామ్-6 దరఖాస్తులు ఎలాపెడుతుంది? అలా పెట్టడం చట్టరీత్యా నేరమని ప్రభుత్వ సలహాదారు సజ్జలకు తెలియదా?

మాకు తెలిసి హైదరాబాద్ లో ఉండేవారు ఎవరైనా ఎన్నికల సమయంలో ఓటు హక్కుకోసం ఇక్కడ ఉండే వారి సొంత గ్రామాల్లో దరఖాస్తు చేసుకుంటే అధికారులు కనీసం 6 నెలలైనా ఇక్కడ ఉండాలని, లేకపోతే కుదరదని చెబుతుంటా రు. అదే నిబంధన సజ్జలకు, ఆయన కుటుంబసభ్యులకు వర్తించదా? ఒకే కుటుంబంలోని వారికి రెండు నియోజకవర్గా ల్లో ఓటు ఎలా ఇస్తారు? ముఖ్యమంత్రికి సన్నిహితుడు, క్యాంప్ క్లర్క్ అయితే ఎన్నికల అధికారులు ఆయనకు దాసోహమైపోతారా? ఫామ్ : 6 లో ఇచ్చిన సెల్ఫ్ డిక్లరేషన్లో సజ్జల తప్పుడు సమాచారం ఇచ్చిఉంటే, వెంటనే ఆయనపై, ఆయన కుటుంబసభ్యులపై సెక్షన్ : 30 ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాం.

ఇంటినెంబర్ల స్థానంలో కూడా ఓటర్ల పేర్లే ఉన్నాయంటే ఈఆర్వోలు, ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు అధికారులు ఎంతగా అధికారపార్టీకి దాసోహమయ్యారో అర్థం చేసుకోవచ్చు
పొన్నూరు నియోజకవర్గ ఓటర్ల జాబితా పరిశీలిస్తే ఈ.ఆర్.వో లు ఎంత దారుణం గా ప్రవర్తిస్తున్నారో, అధికారపార్టీకి ఎంతగా దాసోహమంటున్నారో అర్థమవుతుం ది. ఆ జాబితాను పరిశీలిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి సతీమణి లక్ష్మిగారి సీరియల్ నెంబర్ 799 అయితే, ఆమె ఇంటినెంబర్ గా ఎస్.లక్ష్మి అనే పేరు ఉంటుంది. అలానే రామకృష్ణారెడ్డి సీరియల్ నెంబర్ – 800 అయితే, ఆయన ఇంటి నెంబర్ గా ఎస్.రామకృష్ణారెడ్డి అని ఉంటుంది. భార్గవ్ రెడ్డి సజ్జల సీరియల్ నెంబర్ 801 అయితే ఆయన ఇంటి నంబర్ గా ఎస్.భార్గవ అని ఉంది.

అధికారులు..ఈ.ఆర్వో లు ఎంతగా దాసోహమైతే ఓటర్ల పేర్లనే వారి ఇంటినెంబర్లుగా చూపుతారా? మంగ ళగిరి నియోజకవర్గంలోని బూత్ నెం: 132లో సజ్జల కుటుంబానికి ఓట్లు కేటాయించారు. వారికి కేటాయించిన ఓటర్ల సీరియల్ నెంబర్లు .. 1089 నవ్య మోతే, 1090 లక్ష్మీ సజ్జల, 1091 రామకృష్ణారెడ్డి సజ్జల, 1105 భార్గవ సజ్జల. రెండు నియోజకవర్గాల పరిధిలో ఫామ్-6 దరఖాస్తుల ద్వారా ఓటు హక్కు పొందే అవకాశం సామాన్యులకు దొరుకుతుందా? అదికేవలం సజ్జల కుటుంబానికే సాధ్యం. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చోద్యం చూస్తున్నారు .

సామాన్యులు న్యాయంగా అర్హత ప్రకారం ఓటు హక్కు పొందడానికి దరఖాస్తు చేస్తే ముప్పుతిప్పలు పెట్టే అధికారులకు సజ్జల ఆయన కుటుంబం చేసిన తప్పులు కనిపించడం లేదా? క్యాంప్ క్లర్క్ గా ఆయన దొంగఓటు పొందడమే గాకుండా, ఆయన చుట్టూ ఉండే వారికి కూడా దొంగఓట్లు సృష్టించాడు.

తాము నియోజకవర్గంలో కొత్తగా ఓటుహక్కు పొందినవారి వివరాలు అడిగితే పొన్నూరు ఈఆర్వో మధ్యలో కొన్ని తేదీల సమాచారం దాచేసి మిగిలిన వివరాలు ఇచ్చాడు
పొన్నూరు నియోజకవర్గంలో ఓటు హక్కు పొందడానికి చేసుకున్న దరఖాస్తుల వివరాలు ఇవ్వమని ఎన్నోసార్లు ఈఆర్వోను అడిగాను. అలా అడిగాక ఎప్పటికో మాకు 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలిచ్చి, మరలా 12, 13 తేదీల్లో వచ్చిన దరఖాస్తుల సమాచారం ఇవ్వకుండా, మరలా 14వ తేదీనుంచి ఇచ్చారు. ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ పబ్లికేషన్ పెదకాకానిలో 27-10-23న పబ్లిష్ చేస్తే, దానిలో తొలగించిన మరియు కొత్తగా చేర్చిన ఓట్ల వివరాలు లేకపోతే మేం దానిపై ఈఆర్వోను ప్రశ్నించాం. దానికి ఆయన “ఆ వివరాలు నా లాగిన్ లో ఉన్నాయి.. నేను అన్నీ చేయలేకపోయాను” అని సమాధానం దాటవేశాడు. మాకిచ్చిన సమాచారాన్ని బట్టే స్థానిక ఈఆర్వో దొంగ ఓట్లు చేర్చడం లో ఒక పథకం ప్రకారం కుట్రకు పాల్పడ్డారని అర్థమవుతోంది.

సజ్జల ఓట్ల దొంగ అని ఆధారాలతో బయటపెడితే, ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చుకోకుండా తప్పు బయటపెట్టిన టీడీపీపై బురదజల్లడమేంటి?
తెలుగుదేశం నాయకుల కళ్లుపచ్చగా ఉన్నాయంటున్న సజ్జల.. వైసీపీనేతల కళ్లు నీలి రంగులో ఉన్నాయా? అందుకే నిజాలు చూడలేకపోతున్నాయా? సజ్జల ఓట్ల దొంగ అని మేం ఆధారాలతో సహా బయట పెడితే, దానిపై ఎన్నికల సంఘానికి సమాధానం చెప్పుకోకుండా మాపై, టీడీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తే ఎలా? తెలియక చేశానని.. పొరపాటు జరిగిందని ఒప్పుకుంటే పరవాలేదు. కానీ సజ్జల చెప్పేది చూస్తే ఆయన కావాలనే రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కుకి దరఖాస్తు చేసుకున్నాడని తేలిపోయింది.

సజ్జల తనకు తానుగా ఇచ్చిన పత్రికా ప్రకటనలో ఏం చెప్పారంటే.. “తాను నివాసముండే రెయిన్ ట్రీ అపార్ట్ మెంట్లు పొన్నూరు నియోజకవర్గ పరిధిలో ఉంటే, విల్లాలు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నాయని రెండు చోట్ల ఓటుకి దరఖాస్తు చేశాను.” అని స్వయంగా చెప్పారు. రెండుచోట్ల కావాలనే ఓటుకి దరఖాస్తు చేశానని సజ్జల రామకృష్ణారెడ్డే తనకు తానే ఒప్పుకున్నాడు. నిజాలు చెబితే తమ తలలు పగిలిపోతాయనే శాపం సజ్జల రామకృష్ణారెడ్డికి, ఆయనకొడుకు భార్గవ్ రెడ్డికి ఉంది. అందుకే వారు అన్నీ అబద్దాలే చెబుతున్నారు.

సజ్జల కుటుంబం కావాలనే రెండు నియోజకవర్గాల్లో ఓటుహక్కు పొందడానికి దరఖాస్తు చేసుకుంది. ఉద్దేశపూర్వకంగా తప్పు చేసిన సజ్జలపై ఎన్నికల సంఘం తక్షణమే కఠినచర్యలు తీసుకోవాలి
రెండు నియోజకవర్గాల్లో కావాలనే సజ్జల కుటుంబం ఫామ్-6 దరఖాస్తులు పెట్టింది. పొన్నూరు నియోజకవర్గ పరిధిలో 13-10-2023న ఫామ్ – దరఖాస్తు పెడితే, మంగళగిరి నియోజకవర్గ పరిధిలో 27-10-2023న పెట్టారు. రెండు దరఖాస్తులకు మధ్య 15 రోజుల వ్యవధి ఉంది. ట్విట్టర్ లో మాత్రం ఫామ్-7 దరఖాస్తు జనవరి -31న పెట్టినట్టు ఆ దరఖాస్తుని అప్ లోడ్ చేశాడు. మూడు నెలల తర్వాత కూడా తాను ఫామ్-6 దరఖాస్తు ఎక్కడ పెట్టిందో ఆయనకు తెలియదా? ఎవరి ఓటు ఎక్కడుందో తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం అందరికీ అర్థమయ్యేలా ప్రచారం చేస్తోంది.

మేథావి.. ప్రభుత్వ సలహాదారు.. క్యాంప్ క్లర్క్ అయిన సజ్జలక తన ఓటు ఎక్కడుందో నిజంగా తెలియదా? తన వ్యవహారం బయటకు వస్తుందని తెలిశాకే సజ్జల జనవరి : 31న ఒకచోట ఓటుని డిలీట్ చేయాలని దరఖాస్తు పెట్టాడు. సజ్జలకు అన్నీ తెలుసు, తెలిసే తప్పుచేశాడు…. ఎవరికి తెలుస్తుందిలే అన్న ధైర్యంతోనే సజ్జల..ఆయన కుటుంబం ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చింది. ఉద్దేశ పూర్వకంగా తప్పు చేసిన సజ్జలపై సెక్షన్ : 30 ప్రకారం తక్షణమేఎన్నికల సంఘం కఠినచర్యలు తీసుకోవాలి. అలానే పొన్నూరు, మంగళగిరి ఈఆర్వోలు, ఎన్నికల విధుల్లో ఉన్న ఇతర అధికారులపై కూడా కఠినంగా వ్యవహరించాలి.

హైదరాబాద్ సహా, చుట్టుపక్కల ఉన్న తమ ఆస్తులు కాపాడుకోవడానికే జగన్ రెడ్డి వైసీపీ నేతలు ఆ నగరాన్నే ఉమ్మడిరాజధానిగా ఉంచాలంటున్నారు
ఓటు కావాలంటే ఎవరైనా తప్పనిసరిగా తమకు దేశంలో మరెక్కడా ఓటు లేదని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. అలా ఇస్తేనే వారికి ఓటు హక్కు లభిస్తుంది. ఫామ్-7 అనేది అసందర్భమైనది. కానీ ఫామ్ -6 పై సంతకం పెడితేనే ఎవరికైనా ఓటు వస్తుంది. ఫామ్ – 7 పెట్టిన విషయం తెలియకుండా ఫామ్-6 దరఖాస్తు చేశారా? అదే సామాన్యులు ఎవరైనా ఇలాచేస్తే ఎన్నికల అధికారులు ఊరుకుంటారా? వారి చర్యని తెలియక చేశారులే అని సరిపెట్టుకుంటారా? ప్రభుత్వాన్ని నడిపే క్యాంప్ క్లర్క్ కు తెలియదంటే ఎవరు నమ్ముతారు. ఉద్దేశపూర్వకంగానే సజ్జల రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కుకి దరఖాస్తు చేశాడు. ఓటు వచ్చాక దాన్ని మరోచోటకి మార్చుకోవాలంటే ఫామ్-8 కింద దరఖాస్తు చేసుకోవాలి. ఒకచోట ఓటుహక్కుకి దరఖాస్తు చేసుకొని, వెంటనే 15 రోజుల్లోనే మరోచోట దరఖాస్తు చేస్తే ఊరుకుంటారా?

ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు అధికారులు వైసీపీకి దాసోహ మై పోయి కావాలనే టీడీపీ సానుభూతిపరుల ఓట్లను ఇష్టానుసారం తొలగిస్తున్నారు. ఎవరు దరఖాస్తు పెట్టకుండానే తీసేస్తున్నారు. పొన్నూరు, మంగళగిరి నియోజకవర్గాల్లో తానే ఓటు హక్కుకి దరఖాస్తు చేసుకున్నానని సజ్జలే ఒప్పు కున్నాడు. తప్పు ఒప్పుకున్నాక చర్యలకు ఆలస్యమెందుకు? జగన్ రెడ్డి నిజంగా ఏపీకి ముఖ్యమంత్రా..లేక వేరే రాష్ట్ర ముఖ్యమంత్రా? ఎన్నికల కు ముందు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను.. అమరావతే రాజధాని అని ప్రజల్ని నమ్మించాడు. ముఖ్యమంత్రి అయ్యాక మూడు రాజధానులని చెప్పిఅన్ని ప్రాంతా ల ప్రజల్ని వంచించాడు.

హైదరాబాద్ సహా చుట్టుపక్కల ఉన్న తమ ఆస్తుల్ని కాపాడుకోవడానికే జగన్ రెడ్డి, అతని పార్టీ వాళ్లు ఇప్పుడు హైదరాబాద్ జపం మొదలెట్టారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి చేసిన పాపాలకు.. చేసిన దోపిడీకి జగన్ అండ్ కో ఎక్కడ దాక్కున్నా వారి పాపాలు పండటం ఖాయం. వైసీపీకి ఓటేస్తే చెత్తబుట్టలో వేసినట్టే అని వై.వీ.సుబ్బారెడ్డి చెప్పకనే చెప్పాడు. మేం కొత్త గా చెప్పాల్సింది ఏమీ లేదు.

పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని హైదరాబాదే. ఆ సమయం కూడా అయిపోయింది. ఇంకా హైదరబాదే రాజధాని అనడం పిచ్చితనం కాక మరేమిటి? అధికారం కోల్పోతున్నామని వైసీపీ నేతలే ఒప్పుకుంటున్నారు. సజ్జల రామకృ ష్ణారెడ్డి దొంగఓట్లు సృష్టిస్తుంటే, వై.వీ.సుబ్బారెడ్డేమో రాజధానులు మారుస్తూ ప్రజల్ని నమ్మించడానికి నాటకాలు ఆడుతుంటాడు.” అని ధూళిపాళ్ల ఎద్దేవా చేశారు.