సజ్జల రామకృష్ణ రెడ్డిని కచ్చితంగా అరెస్టు చేయాల్సిందే

  • సజ్జల రామకృష్ణారెడ్డి మరో శశికళ…
  • ఆంధ్ర పోలీస్ పనితీరు సరిగా లేదు… వైసిపి నిందితులకు రాచ మర్యాదలా…??
  • బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ

అమరావతి: గత వైసిపి ప్రభుత్వం లో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి, చంద్రబాబు ఇంటి పైన దాడి తదితర దాడుల కేసుల్లో కుట్రదారుడుగా కచ్చితంగా అరెస్టు చేయాల్సిందేనని తెదేపా నేత, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ డిమాండ్ చేశారు.

గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ మంగళగిరి పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డకి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు మంగళగిరి పోలీసులు ముందు మంది మార్బలంతో హాజరయ్యారని, పోలీసు విచారణలో ఎక్కడ పోలీసులకి సహకరించకుండా అహంకార ధోరణి ప్రదర్శించారని దీనిపైన పోలీసులు సమగ్రంగా విచారణ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వంలో మాదిరి పోలీసులు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో చట్ట ప్రకారం వ్యవహరించకుండా ఏదో మొక్కుబడి గా విచారణ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, పోలీసు వైఖరి మార్చుకోవాలని నిజమైన పోలీసు వలె వ్యవహరించాలని, తాము చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేయాలని లేని పక్షంలో పోలీసులు పై ప్రజా వ్యతిరేకత తెలుగుదేశం శ్రేణులు, వ్యతిరేకత ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని శ్రీధర్ హెచ్చరించారు. సజ్జల రామకృష్ణారెడ్డి నోటీసులు ఇవ్వడం కేసులో ముద్దాయిలుగా పెట్టడం అక్రమాన్ని వైసీపీ నేతలు స్టేట్మెంట్లు ఇస్తున్నారని, ఇది ఎంతవరకు సబబు అని, చట్టంలో మీకో న్యాయం ఇంకోరికి ఇంకో న్యాయం ఉండదని చట్టానికి ఎవరైనా బద్ధులై ఉండాల్సిందేనని, చట్టానికి ఎవరు అతీతులు కాదని శ్రీధర్ తెలియజేశారు.

పార్టీ ఆఫీసు, చంద్రబాబు నివాసం, లోకేష్ పై దాడులు కచ్చితంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనలు మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి వారి పార్టీ శ్రేణులతో అమలుపరిచారని , దాడులను హత్యలను ప్రోత్సహించారని సజ్జల జగన్మోహన్ రెడ్డికి ఒక శశికళ లాంటి వ్యక్తని, తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి జయలలితకు శశికళ ఎలా వ్యవహరించిందో అలా జగన్ మోహన్ రెడ్డి కి సజ్జల వ్యవహారాలు చక్కదిద్దేవాడని, అందుకే గతంలో కర్ణాటక జైలులో శశికళ జయలలిత కలిసి అక్రమ సంపాదన కేసుల్లో శిక్షలు కూడా పడ్డాయని అక్కడ పోలీస్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి శిక్షలు అమలు అయ్యేలాగా చేశారని, మరి ఆంధ్ర పోలీసు సజ్జల శశికళను జగన్మోహన్ రెడ్డిని చేసిన అరాచకాల పై విచారణ ఎలా చేస్తారు?

ఆంధ్ర ప్రజలు దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆంధ్ర పోలీసులపై అతిపెద్ద భారం మొన్న ఎన్నికల్లో ఓట్ల ద్వారా ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టం కట్టి నిరూపణ చేశారని ఇప్పుడు ఆంధ్ర పోలీస్ వ్యవస్థ చట్ట ప్రకారం గత ప్రభుత్వంలో జరిగిన నేరాలు-ఘోరాలు పై చర్యలు తీసుకోకపోతే పోలీస్ పై ఉండే గౌరవం సానుభూతి పోయి వ్యతిరేకత భావనలు ప్రజల్లో ఏర్పడే ప్రమాదం ఉందని శ్రీధర్ హెచ్చరించారు అందువల్ల పోలీస్ గత ప్రభుత్వంలో నేరాలు చేసిన నేరస్తులకు రాజమర్యాదలు చేయకుండా వాళ్లని నిందితులుగా దోషులుగా పరిగణిస్తూనే మిగిలిన నేరాల్లో ఉన్న నేరస్తుల్ని ఎలా విచారణ చేస్తారు.

అలానే పూర్తిస్థాయిలో విచారణ చేయట్లేదని ప్రజలు చర్చించుకుంటున్నారని, బోరుగడ్డ అనిల్ అరెస్ట్ చేసి రాజ మర్యాదలు చేశారని గుంటూరు నల్లపాడు పోలీసులపై ఆరోపణలు పత్రికలు మీడియాల్లో రావటం జరిగిందని… ఇప్పటికైనా పోలీసులు తీరు మార్చుకొని కొత్త ప్రభుత్వంలో నేరస్తులపై వ్యవహరించే విధానం ప్రజలు హర్షించేలాగా ఉండాలని పోలీస్ శాఖను శ్రీధర్ డిమాండ్ చేశారు.

ఫ్రెండ్లీ పోలీస్ గా ప్రజలతో వ్యవహరించమని గత చంద్రబాబు గారి ప్రభుత్వంలో సూచన చేశారని, నిందితులతో ఫ్రెండ్లీ పోలీసు కాదని తీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో ప్రజలు టిడిపి శ్రేణులు పోలీస్ స్టేషన్లో ముందు ధర్నాలు చేసే పరిస్థితి రావచ్చని శ్రీధర్ హెచ్చరించారు.