-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
వినుకొండ: బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తోన్న సజ్జల రామకృష్ణారెడ్డిని ఎన్నికల సంఘం తక్షణం ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవాలని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఏమాత్రం ఉపేక్షించినా పోలింగ్ రోజు వైకాపా మూకలు చెలరేగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలానే వైకాపాకు కొమ్ముకాస్తున్న రిటర్నింగ్ అధికారులపై కూడా ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఫిర్యాదులు చేసిన ఆర్వోలను వెంటనే కౌంటింగ్ విధుల నుంచి పక్కన పెట్టాలని కోరారు.