జ్యుడియషల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటుచేయాలి
జగన్ బాధితులను బాబు సర్కారు ఆదుకోవాలి
ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కె.ఆర్. సూర్యనారాయణ సంచలన ఆరోపణలు
విజయవాడ: జగన్ సర్కారులో చక్రం తిప్పిన నాటి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కె.ఆర్. సూర్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. సజ్జల తనను చంపమని పోలీసులను ఆదేశించారని వెల్లడించారు. తన కుటుంబాన్ని వేధించిన పోలీసు అధికారులు రావి సురేష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
దినపత్రికలో తనపై వచ్చిన వార్త ఆధారంగా నాటి సీఎస్ జవహర్‌రెడ్డి తనపై చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డారన్న సూర్యనారాయణ.. మరి జవహర్‌రెడ్డిపై వచ్చిన ఆధారంగా జవహర్‌రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలి కదా? అని ప్రశ్నించారు. తనను చంపేయమని సజ్జల పోలీసులను ఆదేశించటం తన డ్రైవర్ కూడా విన్నాడన్న సూర్యనారాయణ.. జగన్‌రెడ్డి-సజ్జల వల్ల నష్టపోయిన వారికి చంద్రబాబు సర్కారు న్యాయం చేయాలని కోరారు.
ఆ మేరకు జ్యుడియషల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటుచేయాలని సూచించారు. చంద్రబాబును కలిస్తే నిన్ను దేవుడు కూడా కాపాడలేడని సజ్జల పోలీసులతో బెదిరించాడని, సూర్యనారాయణ ఇంకా దొరకలేదా? దొరికితే చంపేయండి అని పోలీసులకు సజ్జల ఆదేశాలిచ్చారని వెల్లడించారు.
సూర్యనారాయణ ఇంకా ఏమన్నారంటే…” వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్నానని నన్ను అణచి వేయాలని చూశారు. ఏ కేసు పెట్టారో కూడా చెప్పకుండా విచారణకు పిలిచి నన్ను, నా కుటుంబాన్ని వేధింపులకు గురి చేశారు. నా భార్య మెడలోని నల్లపూసల గొలుసు తీయించి పోలీసులు దారుణంగా వ్యవహరించారు”
” వైసీపీ పాలనలో నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసులు మోహరించేవారు.. నేనేమైన్నా సంఘ విద్రోహ శక్తినా? హైదరాబాద్‌లో బంధువుల ఇళ్లకు వెళ్లి మరీ వారిని భయందోళనలకు గురి చేశారు. రాత్రి సమయంలోనూ పోలీసులు అక్కడే ఉండేవారు. నా ఇంటికి సీల్ వేసే అధికారం పోలీసులకు ఎక్కడిది?”
” నా కుటుంబాన్ని వేధించిన పోలీస్ అధికారులు రావి సురేశ్ రెడ్డి, భాస్కరరావులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నా ఫోన్ ట్యాప్ చేసి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును కలిస్తే ,నిన్ను దేవుడు కూడా కాపాడలేడని బెదిరించారు ”
” చంద్రబాబును కలిసిన తర్వాత పోలీసులు తన డ్రైవర్‌ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. సూర్యనారాయణ దొరికాడా అంటూ పోలీసులకు సజ్జల రామకృష్ణ రెడ్డి ఫోన్ చేయడం డ్రైవర్ విన్నా డు’’
పీఎస్సార్ ఆంజనేయులు నా ఫోన్లు ట్యాప్ చేయించారు
‘ సజ్జల ఆదేశాల మేరకు ఇంటలిజన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ఏసుబాబు నన్ను పిలిచి సీపీఎస్ పోరాటం ఆపేయమని బెదిరించారు. 250 కోట్లు జీపీఎఫ్ ఖతా సొమ్ము దొంగిలించడం నేర నేరమని, ఆ విషయం నిర్మలాసీతారామన్ కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేశా. వాణిజ్యపన్నుల శాఖ వైసీపీ మద్దతుదారులయిన అధికారులు దోచుకున్నారు. నేను ఇవన్నీ గవర్నర్‌కు చెప్పానని సీతారాంజనేయులు నా రెండు ఫోన్లు ట్యాపింగ్ చేయించారు’’.