హైదరాబాద్, మహానాడు: ఎమ్మెల్యే సాయన్న మరణించిన అనంతరం కంటోన్మెంట్ టికెట్ సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించగా ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో సాయన్న కుటుంబం కేసీఆర్‌ను కలవటం చర్చనీయాంశమైంది. ఈసారి కూడా కంటోన్మెంట్ టికెట్ సాయన్న మరో కూతురు నివేదితకు కేటాయిస్తారని సమాచారం.