సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు స్కాలర్ షిప్పులను ఇవ్వనున్నారు. కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత పదేళ్ల నుంచి ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ, టెన్త్ క్లాస్ పరీక్షల్లో ప్రతిభను చాటిన విద్యార్థులకు స్కాలర్షిప్పులను ఇస్తున్నారు. ఈ సంవత్సరం కూడా టెన్త్ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్ధులకు ఆదివారం సాయంత్రం 4.00 గంటలకు సత్తెనపల్లిలోని వెంకటేశ్వర గ్రాండ్ కల్యాణ మండపంలో స్కాలర్ షిప్పులు పంపిణీ చేయనున్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ, దర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి పాల్గొననున్నారు. ట్రస్ట్ చైర్మన్, శాసనసభ్యులు కన్నా లక్ష్మీ నారాయణ అధ్యక్షత జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు.