యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. జీరో టాలరెన్స్ ట్యాగ్ లైన్. ‘భారతీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ‘భారతీయుడు 2’ ట్రైలర్‌ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు.. ట్రైలర్‌ను గమనిస్తే… ‘ఊరారా ఇది.. చదువుకు తగ్గ జాబ్ లేదు.. జాబ్‌కు తగ్గ జీతం లేదు..కట్టిన ట్యాక్స్ తగ్గినట్లు సౌకర్యాలు లేవు..దొంగలించేవాడు దొంగలిస్తూనే ఉన్నాడు, తప్పు చేస్తున్నవాడు తప్పు చేస్తూనే ఉంటాడు’’ అని ఓ మహిళ తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది.
మరో వైపు హీరో సిద్ధార్థ్ ‘మనం ఒక్కొక్కరినీ తప్పు పడుతూనే ఉంటాం. సిస్టమ్ సరిగా లేదు. సరి చేయాలని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటాం. కానీ దాన్ని సరి చేయటానికి కొంచెం కూడా ప్రయత్నించటం లేదు’ తన బాధను వ్యక్తం చేస్తాడు. కొంత మంది యువత రోడ్ల పైకి వచ్చి పోరాటం చేస్తుంటే పోలీసులు వారిపై కాల్పులు జరుపుతారు. మనం మొరిగే కుక్కలం మాత్రమే.. అందుకే అరుస్తున్నా అని అందులో ఓ యువకుడు తన ఆక్రోశాన్ని వెల్లగక్కుతాడు. ఇలా దేశమంతా అల్లర్లతో అట్టుడికి పోతుంటుంది. ఆ సమయంలో వీరందరినీ చీల్చి చెండాడే ఓ వేట కుక్క రావాలి అని సిద్ధార్థ్ అంటాడు. అలా ఎవరుంటార్రా అని ప్రియా భవానీ శంకర్ అంటే ఉండేవారు అని సిద్ధార్థ్ సమాధానం చెబుతాడు. ఆయనే మళ్లీ రావాలి. ఓ తప్పు చేస్తే దాన్నుంచి తప్పించుకోలేమనే భయం రావాలి అంటూ సిద్ధార్థ్ చెబుతాడు. అప్పుడు సేనాపతి (కమల్ హాసన్)ని చూపించారు. పార్ట్ వన్ భారతీయుడులో ఆయనేం చేశాడనే దాన్ని సింపుల్‌గా చూపించారు.