కులంతో రాజకీయం చేయటానికి సిగ్గుందా?

చంద్రబాబు మాటలు వక్రీకరిస్తున్నారు…
ఐపీలు పెట్టిన వారి నుంచి కమీషన్లు దండుకున్న చరిత్ర మీది
కార్పొరేషన్‌ నుంచి ఒక్క రూపాయి ఇచ్చారా?
ఆర్యవైశ్యులపై పైశాచికత్వాన్ని ఆపగలిగారా?
నరసరావుపేట టీడీపీ ఆర్యవైశ్య నాయకుల ఆగ్రహం

నరసరావుపేట, మహానాడు: టీడీపీ అధినేత చంద్రబాబు రావులపాలెం సభలో గంజాయి కిరాణా షాపుల్లో దొరుకుతుం దన్న వ్యాఖ్యలను వక్రీకరించి కుల రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఆర్యవైశ్య నాయకులు మండిపడ్డారు. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని ఖండిరచారు. నరసరావుపేటలో ఐపీలు పెట్టి ఆర్యవైశ్యులకు 150 కోట్లు టోపీలు పెట్టిన వారిని రక్షిస్తూ ఎమ్మెల్యేతో కలిసి కమీషన్లు దండుకుంటున్న వైసీపీ ఆర్యవైశ్య నాయకులకు కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడానికి సిగ్గుందా అని ప్రశ్నించారు. కమీషన్లలో మీకు వాటా లేదని చెప్పే దమ్ముంటే అమ్మవారి విగ్రహం వద్దకు ప్రమాణానికి రావాలని సవాల్‌ విసిరారు. దివంగత నేత రోశయ్య విగ్రహానికి ఐపీలు పెట్టిన వారి దగ్గర బలవంతంగా విరాళాలు తీసుకున్న మాట వాస్తవం కాదా అని నిలదీశారు.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక నువ్వు ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ అయ్యాక కార్పొరేషన్‌ నుంచి ఒక్క రూపాయి అయినా ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం ఇచ్చావా అని నిప్పులు చెరిగారు. ఒంగోలు లో సుబ్బారావు గుప్తా, తెనాలిలో ఆర్యవైశ్యులను మోకాళ్ల మీద కూర్చోబెట్టి వైసీపీ నాయకులు హీనంగా మాట్లాడితే నువ్వు ఎందుకు ఖండిరచలేకపోయావని, వైసీపీ ఎంగిలి మెతుకులకు వెంపర్లాడే శునకం లాంటి వాడివని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో రాష్ట్ర వాణిజ్య విభా గం అధికార ప్రతినిధి అత్తులూరి సుబ్బారావు, మాజీ కౌన్సిలర్లు గట్టుపల్లి సత్యనారాయణ, కొత్తూరు హనుమంతరావు, రాష్ట్ర కార్యదర్శి వనమా శివ, అత్తులూరి సాంబశివరావు, వనమా పవన్‌, మాజేటి పుల్లారావు, కొత్తూరి సుబ్బరాయుడు, కాకుమాను వెంకట్రావు, కోడూరు రాము, ఆతుకూరి రామకృష్ణ, పల్లబోయిన ప్రసాద్‌, నాగవరపు ప్రసాద్‌, తాళ్లూరి సత్యనారాయణ, తాడేపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.