ఆయన పాలనతో మోదీ పాలనను పోల్చడం దివాలాకోరుతనం
దళితులను చంపి బాబాయ్‌ను లేపేసి ట్రెండ్ సృష్టించారు
సమస్త వనరులను లూటీ చేసి ట్రెండ్ సృష్టించారు
అధికారులను తొత్తులుగా మార్చుకుని ట్రెండ్ సృష్టించారు
సిండికేట్లతో కోట్లకు పడగెత్తి నువ్వుకూడా ట్రెండ్ సృష్టించావ్
బొత్స వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ఆర్.డి.విల్సన్ ఫైర్
విజయవాడ, మహానాడు : పదేళ్ల పాలన చూసి ఓటు వేయమని మోదీ అడగలేదు…జగన్ తన పాలన చూసి ఓటు వేయమన్నాడని వైకాపా నాయకుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ఆర్.డి.విల్సన్ స్పందించారు. 370 ఆర్టికల్ రద్దు నుంచి రామ జన్మభూమి వరకూ మోదీ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందలేదా…తెలుగు రాని బొత్స అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కరోనాకు ఫ్రీ వ్యాక్సిన్ నుంచి రెండేళ్లుగా ఇస్తున్న రేషన్ వరకు మోదీ సంక్షేమ పాలనకు నిదర్శనం కాదా? ప్రపంచం నివ్వెర పోయేలా అంత రిక్ష పరిశోధన కోసం వందలాది రాకెట్లు పంపించడం మోదీ ముందుచూపు కాదా? సిగ్గులేని బొత్స..జగన్ పాలనను మోదీ పాలనను పోల్చడం ఆయన దివాలాకోరు తనానికి నిదర్శనమని మండిపడ్డారు.
నిజమే జగన్ ట్రెండ్ సృష్టించాడు
దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా దళితుల పథకాలు మూసివేసింది లేదు ఆ విషయంలో జగన్ ట్రెండ్ సృష్టించాడు. దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన అనంతబాబును పక్కన పెట్టుకోవడం ద్వారా కొత్త ట్రెండ్ సృష్టించాడు. సొంత చిన్నాన్నని లేపేసిన సంఘటనలో నరహంతకుడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని జగన్ కొత్త కుటుంబ విలువలకు పునాది వేశాడు. సొంత చెల్లి, చిన్నాన్న కూతురు రోడ్డు మీదకు వచ్చి దుమ్మెత్తి పోస్తుంటే సమాధానమివ్వడం చేతగాక దేవుడే చూసుకుంటాడని ఫలయానం చిత్తగించడంలో ట్రెండ్ సృష్టించా డు. కోడి కత్తి కేసులో ఒక దళితుడిని ఐదేళ్లు జైల్లో పెట్టించాడు.
ఇళ్ల స్థలాల పేరుతో స్కామ్ చేసి ట్రెండ్ సృష్టించారు
ులకరాయ కేసులో ఒక బీసీని జైల్లో పెట్టించి నా ఎస్సీ, నా బీసీ అని దొంగ జపం చేయ డంలో ట్రెండ్ సృష్టించాడు. ఆరు అంకణాల స్థలం ఇచ్చే స్కీములో స్కామ్ సృష్టిం చి ఎమ్మెల్యేల జేబు నింపే పథకాన్ని వ్యూహరచన చేయడంలో ట్రెండ్ సృష్టిం చాడు. రూ.10 లక్షలు ఖరీదు చేసే భూమిని రూ.30 లక్షలకు సంతకం పెట్టమని అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిని అప్పటిమంత్రి అనిల్‌కుమార్ యాదవ్, కావలి ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి బండ బూతులు తిడితే వారిని మందలించ కుండా కలెక్టరును బదిలీ చేసి కొత్త ట్రెండ్ సృష్టించాడు. అయినా సదరు కలెక్టర్ శేషగిరి నీ సామాజికవర్గమైనా ఇది కరెక్ట్ కాదని జగన్ కు సూచించకుండా నువ్వు కూడా ట్రెండ్ సృష్టించావు. ఐఏఎస్‌లను… అయ్యా ఎస్‌లను చేసి సివిల్ సర్వెంట్లను తన సర్వెంట్లుగా మార్చుకోవడంలో ట్రెండ్ సృష్టించాడు. అయినా అవినీతిలో కూరుకుపోయిన నీకు కులాభిమానం ఎందు కుంటుందిలే. అక్రమ మద్యం సారా సిండికేట్లలో కోట్లకు పడగలెత్తిన నీకు జగన్ ఉత్తమోత్తముడుగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు.
సమస్త వనరులు లూటీ చేసి ట్రెండ్ సృష్టించాడు
బడుగుల ప్రాణాలు తీసే కల్తీ మద్యం ఆదాయాన్ని చూపించి బ్యాంకులో లోన్ తీసుకోవడం ద్వారా నిజమే జగన్ ట్రెండ్ సృష్టించాడు. మోదీ దయతో వేల కోట్ల నిధులు తీసుకుని రాష్ట్రాన్ని నడిపి ఇప్పుడు ఆయన్ని కామెంట్ చేయడంలో బొత్సా నువ్వు కూడా ట్రెండ్ సృష్టించావు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఒక్క కంపెనీ తీసుకురాకుండా పోలవరం పడకేయించి జగన్ ట్రెండ్ సృష్టించాడు. ఇసుక, మద్యం, మైనింగ్ సమస్త సహజ వనరులు లూటీ చేసి లక్షల కోట్లకు పడకులెత్తడంలో జగన్ ట్రెండ్ సృష్టించాడు. పేదవాడినని చెబుతూ 9 నగరాల్లో ప్యాలెస్‌లు నిర్మించుకుని ట్రెండ్ సృష్టించారని ఎద్దేవా చేశారు.