ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లో వైసీపీకి షాక్‌

రావి వెంకటరమణ ఆధ్వర్యంలో భారీగా టీడీపీలోకి వలసలు
యువనేత నారా లోకేష్‌ సమక్షంలో పార్టీలో చేరిక

అమరావతి: ప్రత్తిపాడు, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ ఆధ్యర్యంలో బుధవారం 50 మంది ప్రస్తుత సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో వారికి యువనేత నారా లోకేష్‌ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లోకేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే పార్టీ టీడీపీ అని, ఏ కష్టమొచ్చినా కడుపులో పెట్టుకు ని చూసుకుంటామని పేర్కొన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా వందకోట్లకు పైగా అందించిన ఏకైక పార్టీ టీడీపీ మాత్రమేనని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీకి 70 లక్షల మంది పసుపు సైనికులే ఆస్తి అని, తెలుగుజాతి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తామని తెలిపారు. ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడ ఉన్నా సుభిక్షంగా ఉండాలన్నదే తమ పార్టీ లక్ష్యమని, రాబోయే ఎన్నికల్లో ఆయా నియో జకవర్గాల్లో పసుపుజెండా ఎగురవేసేందుకు కలసికట్టుగా కృషిచేయాలని కోరారు.

పార్టీలో చేరిన వారిలో ముప్పాళ్ల విశ్వేశ్వరరావు, గింజుపల్లి సుబ్బారావు, కమ్మా నాగమల్లేశ్వరరావు, మదమంచి శ్రీనివాసరావు, యలవర్తి నరసింహరావు, రావిపాటి కృష్ణప్రసాద్‌, కుర్రా శివనాగేశ్వరరావు, గుంటుపల్లి రవిబాబు, గురజవోలు పద్మావతి, ఘంటా కామేశ్వరరావు, వణుకూరు వీరారెడ్డి, పేరం శ్రీనివాసరావు, మొగిలి భరత్‌ కుమార్‌, కొమ్మినేని స్వామి, అరవపల్లి రాంబాబు, ఆరే నరేంద్ర, మద్దినేని శ్రీనివాసరావు, కంచర్ల కోటేశ్వరరావు, నల్లగొర్ల ఓబయ్య, పాటిబండ్ల రాంబాబు, పాగోలు శివకృష్ణ, వేముల శివపా ర్వతి, పురుషోత్తపట్నం గోకుల్‌రావు, దాసరి కుమారస్వామి, అన్నవరపు కృష్ణచైతన్య, షేక్‌ సుభాని, షేక్‌ బాషా, షేక్‌ సూఫియా సుల్తాన్‌, కొండబోలు బ్రహ్మయ్య, షేక్‌ మక్బూల్‌, యామిని శ్రీహరి, ముక్కామల విజయబాబు, బన్నారావూరి శివరామకృష్ణ, షేక్‌ వాహిదుల్లా, షేక్‌ మౌలాలి, కంచర్ల మహేష్‌ పాల్‌, కటికల చంద్రకుమార్‌, జొన్నకూటి లక్ష్మీకాంత్‌, జాస్తి సాంబశివరావు, పిల్లి ప్రసాదరావు, మానుకొండ రవికాంత్‌, నాగళ్ల శ్రీనివాసరావు, గద్దె కిషోర్‌, గుండాల ప్రసాద్‌, సురభి దానయ్య, మోపర్తి శంకర్‌, రమావత్‌ హరినాయక్‌, సందేటి కొండలు, జంగా రాజేష్‌, కొత్తపల్లి దిలీప్‌, గూడూరి సాయికృష్ణ, యడ్లపల్లి శేషగిరిరావు తదితరులు ఉన్నారు.