విద్యార్థులకు షూలు, రెండు జతల సాక్స్‌లు

-జూన్‌ 12 నాటికి స్కూల్‌ కిట్లు అందించాలి
-పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌

విజయవాడ: జూన్‌ 5వ తేదీ నాటికి అన్ని షూల(బూట్లు) రవాణా పూర్తి చేయా లని, జూన్‌ 12వ తేదీ నాటికి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజున స్కూల్‌ కిట్‌ అందేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆదేశించారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుకునే వారికి నల్ల రంగు బూట్లు, రెండు జతల సాక్స్‌లు అందించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. స్కూల్‌ బ్యాగు ఫ్యాక్టరీల మాదిరిగానే ఈసారి షూ తయారు చేసే ఫ్యాక్టరీలను సందర్శించామని తెలిపారు. నాణ్యత, సరఫరాలో ఎటువంటి లోపం ఉన్నా ప్రధాన కార్యదర్శిపై ఆ ప్రభావం పడుతుందని, అందువల్ల వస్తువు తయారీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వారికి సూచించినట్లు చెప్పారు.