ఆదర్శంగా నిలిచిన జ్యోతి ఆమ్గే
చదువుకున్న స్కూలులోనే ఓటుహక్కు
నాగ్‌పూర్: లోక్‌సభ తొలిదశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. సాధారణ పౌరులతో పాటు సినీ నటులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో ప్రపంచం లోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి ఆమ్గే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి అందరితో పాటు క్యూ లైన్‌లో నిలుచుని ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిఒక్కరు ఓటు వేయాలని, ఓటుహక్కు దేశ పౌరులుగా మన బాధ్యత అని విజ్ఞప్తి చేశారు. తనతో పాటు తన కుటుంబసభ్యులంతా ఓటుహక్కు వినియోగించుకున్నానని చెప్పారు. తాను చదువుకున్న స్కూలులోనే ఓటు వేసినట్లు తెలిపారు.