ప్రభుత్వానికి కార్యకర్తలు పెట్టుబడి పెట్టాలా?

– పనులు చేసిన వైసీపీ కార్యకర్తలకు బిల్లులు రాలేదు
– ఎమ్మెల్యేగా సీఎం నుంచి ఒక్క రూపాయీ సాధించలేకపోయా
– చంద్రబాబును తిడితే పదవులు ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించా
– కక్ష సాధింపు చర్యలతో ఏమీ సాధించలేరు
– అధికారం ఉందని అహంకారం ప్రదర్శించకూడదు
– అనుచరులతో మాట్లాడి త్వరలో నిర్ణయం
– మైలవరంలో అనుచరులతో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆత్మీయ సమావేశం

గత ఎన్నికలకు ముందు జగన్ ను కలిసి రాజధానిపై స్పష్టత అడిగితే.. నేను ఇల్లు కూడా కట్టుకున్నా కదా.. అమరావతిలోనే ఉంటుందని చెప్పారు. ఎన్నికల తర్వాత జగన్ మాట మార్చారు. పార్టీలో అవమానాలు ఎదురవుతున్నా ఏడాదిగా సహించాను. రాజధాని అమరావతి విషయంలో పార్టీకి తీవ్రంగా నష్టం జరుగుతుందని చెప్పా . తప్పనిసరైతే సెక్రటేరియట్ అయినా ఇక్కడే ఉంచాలని కోరా.

నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యేగా సీఎం నుంచి ఒక్క రూపాయీ సాధించలేకపోయా . పనులు చేసిన వైసీపీ కార్యకర్తలకు బిల్లులు రాలేదు. ప్రభుత్వానికి కార్యకర్తలు పెట్టుబడి పెట్టాలా? కక్ష సాధింపు చర్యలతో ఏమీ సాధించలేరు. అధికారం ఉందని అహంకారం ప్రదర్శించకూడదు. చంద్రబాబును తిడితే పదవులు ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించా . మనసు గాయపడ్డాక నిలువెత్తు బంగారం ఇస్తానన్నా వెనక్కి వెళ్లను. అనుచరులతో మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకుంటా .