ఏ పరీక్ష రాయనోళ్లు ఈ వాయిదా అడుగుతున్నారు
ముగ్గురు దీక్ష చేస్తే.. దాంట్లో ఒక్కరు కూడా ఏ పరీక్ష రాయట్లేదు
ఓ కోచింగ్ సెంటర్ యజమాని పరీక్ష వాయిదా వేయమని ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నడు
రెండు నెలలు డీఎస్సీ పోస్ట్ పోన్ చేస్తే 100 కోట్లు లాభం వస్తుంది అని చెప్తున్నారు
జాబ్ క్యాలెండర్ ను అసెంబ్లీలో డిక్లేర్ చేస్తా
జూన్ 2 లోపల నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్ 9 లోపు భర్తీ
డీఎస్సీ,గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని కూడా ఈ సంవత్సరం చివరలోపు భర్తీ
సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటుకు ప్రధాన కారణం నిరుద్యోగ సమస్య.నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోతే ప్రజాప్రతినిధులు విఫలమైనట్లే. అందుకే నిరుద్యోగ యువకులు,విద్యార్థుల కోసం మా ప్రభుత్వం వివిధ ప్రణాళికలు రూపొందిస్తుంది.గత 20 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న , కోర్టు కేసులు క్లియర్ చేసి ఏకకాలంలో 19 వేల టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాం.
గ్రూప్ 1పరీక్ష కు 4 లక్షల 3వేల మంది దరఖాస్తు చేసుకొని, మూడు లక్షలకు పైగా ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన నిరుద్యోగులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా నిర్వహించాం.గ్రూప్ వన్ లో గత ప్రభుత్వం బయోమెట్రిక్ తీసుకుంటామని తీసుకోకపోవడం వల్ల కోర్టు స్ట్రైక్ ఆఫ్ చేసింది.ఇచ్చిన నోటిఫికేషన్ అమలు చేసిన తీరును తప్పు పట్టింది.
మా ప్రభుత్వం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ లో ఏ అంశాలను పొందుపరిచామో అదే పద్ధతిలో పరీక్షలు నిర్వహించి రిజల్ట్స్ ఇచ్చాం. 2022లో గత ప్రభుత్వం 1:50 రేషియోలో నోటిఫికేషన్ ఇచ్చింది.ఆ పరీక్షల్లో జరిగిన విషయాలతో రద్దు కాబడ్డ సంగతి అందరికీ తెలుసు.
సేమ్ గైడ్లైన్స్ లో పరీక్షలు నిర్వహించాక కొందరు ఇప్పుడు 1:100 అంటున్నారు. మాకేం ఇబ్బంది లేదు పిలవడానికి.కానీ, కోర్టుల్లో ఇబ్బంది ఎదురవుతుంది. 1: 50 అని చెప్పి పరీక్షలు నిర్వహించి ఇప్పుడు 1:100 అనే రిజల్ట్స్ ఇస్తే ఫండమెంటల్ కు వ్యతిరేకమని కోర్టు మళ్ళీ స్ట్రైక్ ఆఫ్ ఇస్తుంది.గ్రూప్ 1 వ్యవహారం మళ్ళీ మొదటికి వస్తుంది.2011 నుండి 2024 వరకు గ్రూప్ వన్ కంప్లీట్ కాలేదు.
ఆరోజు 21 నుండి 22 ఏళ్ల పిల్లగాడు ఈరోజు 34 ఏళ్లు దాటిపోయాడు.యుక్త వయసు మొత్తం కోచింగ్ సెంటర్లలోనే గడిచిపోయింది.అన్నింటిని దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ ప్రకారం పరీక్షలు నిర్వహించాం.విద్యార్థుల జీవితాల పై మన విధానాలు ఇబ్బంది కాకూడదు. పోస్ట్ ఫోన్ తో ప్రజాప్రతినిధులకు పోయేది లేదు.ఉద్యోగాలు కావాలని కొట్లాడింది మనమే.పరీక్షలు ఇబ్బంది లేకుండా నిర్వహిస్తుంటే, కొందరు వాయిదా కావాలంటున్నరు.
రెండు సంవత్సరాల నుండి డీఎస్సీపరీక్షలు నిర్వహించలేదు.రెండు సంవత్సరాల నుండి నిరుద్యోగులు డీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నారు. పరీక్షల సిలబస్ గాని విధానాన్ని మార్చలేదు. కానీ కొన్నిరాజకీయ శక్తులు,కోచింగ్ సెంటర్లు వాళ్ల లాభాల కోసం పరీక్షలు వాయిదా కోరుతున్నరు. ఏ పరీక్ష రాయనోళ్లు ఈ వాయిదా అడుగుతున్నరు. ముగ్గురు దీక్ష చేస్తే.. దాంట్లో ఒక్కరు కూడా ఏ పరీక్ష రాయట్లేదు. వారి వివరాలు సేకరిస్తే ఓ కోచింగ్ సెంటర్ యజమాని పరీక్ష వాయిదా వేయమని ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నడు. నేను ఆయన ఏ పరీక్ష రాస్తున్నాడని అడిగితే.. ఆయనకి కోచింగ్ సెంటర్ ఉంది రెండు నెలలు డీఎస్సీ పోస్ట్ పోన్ చేస్తే 100 కోట్లు లాభం వస్తుంది అని చెప్తున్నరు.
ఇంకో ఆయన మన పార్టీలోనే ఉండే కదా.. ఆయన ఏం పరీక్ష రాస్తున్నడు, దీక్ష ఎందుకు చేస్తున్నడని అడిగితే.. నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదని, నిన్ను గిల్లటానికి దీక్షకు కూర్చున్నడు అని చెప్పారు. ఇంకో పిల్లగాడు గాంధీ ఆసుపత్రిలో చేరి దీక్షకి కూర్చున్నడు.. ఏం పరీక్ష రాస్తున్నడు అవసరమైతే స్పెషల్ కోచింగ్ ఇప్పిద్దామని అడిగితే.. ఆయన ఏం పరీక్ష రాయట్లేదు. ఒక లీడర్ చెప్పిండంట పేరు వస్తదని చేశాడంట అని చెప్పారు.
జాబ్ క్యాలెండర్ ను అసెంబ్లీలో డిక్లేర్ చేస్తా. 31 మార్చి వరకు ఖాళీలు సేకరించి, జూన్ 2 లోపల నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్ 9 లోపు భర్తీ చేస్తాం. సివిల్స్ మాదిరిగా జాబ్ కేలండర్ ఉండాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశం. గతంలో ఔట్ సోర్సింగ్ వాళ్లను పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో నియమించారు. ఉద్యోగాల భర్తీ వాళ్లకు అప్పగిస్తే ఎలా చేస్తారు? అందులో ఒక ఆయన ఆర్ఎంపి ఈయన గ్రూప్ 1 అధికారిని ఇంటర్వ్యూ చేసి నియమిస్తడట.గ్రూప్ వన్ పేపర్ తయారు చేసే వాళ్ళు, నియమించేవాళ్లు అంతకంటే పై స్థాయి వాళ్లు అయి ఉండాలి.
రాజకీయ పునరావాస కేంద్రాలుగా విద్యావ్యవస్థలు మారకూడదు. ప్రభుత్వం ఏర్పడ్డ 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాల నియామక పత్రాలు అందించాం. ఎవరెవరికి ఇచ్చామో ఆన్లైన్ లో చూసుకోవచ్చు. డీఎస్సీ,గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని కూడా ఈ సంవత్సరం చివరలోపు భర్తీ చేయాలనుకుంటున్నాం. ఆర్థిక సమస్యలు ఉన్నా ఉద్యోగాలను భర్తీ చేసి తీరాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.