కాంగ్రెస్‌ మోసాలను ఎండగట్టాలి

-మాజీ మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట, మహానాడు: ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ పార్టీ మోసాలను ఎండగట్టాలని మాజీ మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. మెదక్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పి.వెంకట్రామరెడ్డి ఎన్నికల ప్రచారం లో భాగంగా సిద్దిపేటలోని కొండ మల్లయ్య గార్డెన్స్‌లో సోమవారం సిద్దిపేట నియోజకవర్గ స్థాయి యువత సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి జై తెలంగాణ అన్నాడా? అమరవీరులకు నివాళి అర్పించారా? అని ప్రశ్నించారు. ఒక్క పరీక్ష నిర్వహించారా…తమ హయాంలో ఉద్యోగాలు వస్తే మీరు చెప్పుకుంటారా అని ధ్వజమెత్తారు. సిద్దిపేట వెటర్నరీ కళాశాలను కొడంగల్‌కు ఎత్తు కెళ్లారు. రూ.150 కోట్ల నిధులు రద్దు చేశారు. సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్న కాంగ్రెస్‌, బీజేపీలకు బుద్ది చెప్పాలని కోరారు. మాజీ కలెక్టర్‌గా వెంకట్రామరెడ్డికి ఎంపీ ఎన్నికల్లో యువత పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వాలని కోరా రు. 100 రోజులు గడిచినా హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ను నిలదీయాలని పిలుపుని చ్చారు. సిద్దిపేటకు రైలు, గోదావరి జలాలు వచ్చాయంటే కేసీఆర్‌తోనే జరిగిందన్నారు. బీజేపీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అంటూ మోసం..డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెంచారని, రఘునందన్‌ను దుబ్బాకలో చిత్తుగా ఓడిరచారు…ఇక్కడ తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

సిద్దిపేట జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: వెంకట్రామరెడ్డి
మెదక్‌ ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌, హరీష్‌రావు సహకారంతో సిద్దిపేట జిల్లాను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం తనను అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని విజ్ఞప్తి చేశారు. యువకుల కోసమే 100 కోట్లతో పీవీఆర్‌ ట్రస్టు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అధ్యాపకులతో ఉచిత కోచింగ్‌, వృత్తి నైపుణ్య శిక్షణ అందించి 6 మాసాల కొకసారి జాబ్‌ మేళా ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. 7 నియోజకవర్గాలలో 7 ఫంక్షన్‌ హాళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఎడ్లు బండి, నిరుద్యోగ భృతి, పింఛన్‌, ఆసుపత్రి నిర్మాణం చేస్తానని ఎమ్మెల్యేగా గెలిచి మోసం చేసిన రఘునందన్‌కు మొన్న ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.