రోడ్డు ప్రమాదంలో ఎస్ఐకి తీవ్ర గాయాలు

కర్నూలు, మహానాడు: ఎమ్మిగనూరు మండలం, కందనాతి మాచమానదొడ్డి గ్రామం మలుపు దగ్గర గురువారం ఉదయం 9 గంటల సమయంలో బైకు, ఆటో ఢీకొన్న సంఘటనలో ఎస్ఐకి ఒక కాలు విరిగిపోయింది. రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ బాల నాయక్‌ స్కూల్‌ విద్యా కమిటీ ఎన్నికల విధులకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నాయక్ ను చికిత్స కోసం హుటాహుటిన కర్నూలు మెడికల్ కళాశాలకు తరలించారు.