సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి మృతి పట్ల స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. రాజ్యసభ ఎంపీగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఏచూరి దేశ ప్రజలకు సుపరిచితులయ్యారని అన్నారు.