కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

కృష్ణా: గన్నవరం నియోజకవర్గం తేలప్రోలు రైల్వేస్టేషన్‌ వద్ద కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో లోకో పైలట్‌ అత్యవసరంగా రైలును నిలిపివే శారు. హుబ్లీ నుంచి చెన్నై వెళ్లే ఈ రైలుకు బ్రేక్‌ పైపులు హీట్‌ కావడంతో బోగీ లలో పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన లోకో పైలట్‌ అత్యవసరంగా రైలును నిలిపివేశారు. బ్రేక్‌ పైపులు సరిచేసిన అనంతరం చెన్నైకు బయలుదేరింది.