చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనం
మంత్రివర్గ కూర్పుపై ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు
వినుకొండ: అన్నివర్గాలకు న్యాయం చేస్తూ సామాజిక సమతూకం పాటిస్తూ యువతరానికి పెద్దపీట వేసిన మంత్రివర్గ కూర్పు అద్భుతంగా కుదిరిందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కూటమి మంత్రివర్గంలో ఏకంగా 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించడాన్ని సాహసోపేతమైన నిర్ణయంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనంగా అభివర్ణిం చా రు. అన్నిప్రాంతాలు, అన్ని జిల్లాలు, అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా మంత్రుల ఎంపికలో చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నారని కితాబిచ్చారు. ముగ్గురు మహిళలకు కూడా చోటు కల్పిస్తూ, సీనియర్లు, యువత, విద్యావంతులు, అనుభవజ్ఞుల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారని ప్రశంసించారు. తొలిసారి గెలిచిన వాళ్లలో 10 మందిని మంత్రులుగా ఎంచు కోవడం ద్వారా కూడా కొత్త తరానికి ప్రాతినిధ్యం కల్పించినట్లయిందన్నారు.