నెల్లూరు, మహానాడు: నెల్లూరులోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను కోరిన వెంటనే పొదలకూరు సి.హెచ్.సీలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టిన మంత్రి సత్యకుమార్ కు ధన్యవాదములు తెలిపారు.
వెంకటాచలం. పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో జనరేటర్లు, వాషింగ్ మిషన్లు, కంప్యూటర్లతో పాటు మార్చురీలో ఫ్రీజర్లు అందుబాటులోకి తేవాలని కోరారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటుతో పాటు అదనపు భవనాల నిర్మాణాల ప్రతిపాదనలను మంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. అల్లిపురంలోని జిల్లా పరిషత్ హైస్కూలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎడ్యుకేషనల్ ట్రస్టు ద్వారా 3.50 ఎకరాల భూమిని ఇచ్చిన విషయంతో పాటు పి.హెచ్,సీకి రాజగోపాల్ రెడ్డి గారి పేరు పెట్టే విషయంపై చర్చించారు.