Mahanaadu-Logo-PNG-Large

త్వరలో అమరావతి అమరవీరుల స్మారక స్థూపం

గౌరవ అధ్యక్షుడిగా యలమంచిలి ప్రసాద్‌
బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య

అమరావతి, మహానాడు : ప్రజా రాజధాని అమరావతి ఉద్యమ స్ఫూర్తి చిహ్నంగా రాజధాని ఉద్యమంలో అమరులైన అమరావతి అమరవీరుల పేరిట స్మారక స్థూపం నిర్మించబోతున్నట్లు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చికాగోకు చెందిన ఎన్‌ఆర్‌ఐ యలమంచిలి ప్రసాద్‌ గౌరవ అధ్యక్షుడిగా అమరవీరుల స్మారక కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాజధాని ఉద్యమానికి బాసటగా నిలిచిన రాజకీయ పార్టీల పెద్దలు, ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్న అన్ని జేఏసీలు, మద్దతు ఇచ్చిన మేధావుల సూచనలతో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. స్థూపానికి స్థల సేకరణ, ఆకృతి వంటి అంశాలపై అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మారక స్థూపం కార్యక్రమంలో పాలుపంచుకునే వారు తమ అభిప్రాయాలను, సలహాలను 9849792124 వాట్సాప్‌ నెంబరుకు పంపాలని సూచించారు.