– మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్: ఇక్కడి ముత్యాలమ్మ ఆలయాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పలు ప్రముఖ దేవాలయాలకు చెందిన పండితులతో కలిసి పూజలలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వహకులు, బస్తీ ప్రజలతో మాట్లాడారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కుంభాభిషేకం, మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు ఉంటాయని వెల్లడించారు. ఎలాంటి రాజకీయ ప్రమేయాలు లేకుండా, ఉద్రిక్తతలకు తావులేకుండా బస్తీ వాసుల సమక్షంలో పూజలు నిర్వహిస్తామని చెప్పారు.