Mahanaadu-Logo-PNG-Large

కౌంటింగ్‌ నేపథ్యంలో ఎస్పీ సూచనలు

-రాజకీయపార్టీలు, ప్రజలు సహకరించాలి
-ఊరేగింపులు, ర్యాలీలు, బాణసంచా నిషేధం

గుంటూరు, మహానాడు: కౌంటింగ్‌ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని ఎస్పీ తుషార్‌ డూండి కోరారు. కౌంటింగ్‌కు ముందు, కౌంటింగ్‌ రోజు, కౌంటింగ్‌ తర్వాత ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, కౌంటింగ్‌ రోజు 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందని తెలిపారు. కౌంటింగ్‌ ముగిసిన తర్వాత ఎటువంటి ఊరేగింపులు, ర్యాలీలు చేయకూడదని, మందుగుం డు సామగ్రిని కాల్చకూడదని సూచించారు. ఎవరు కూడా గుంపులుగా ఉండకూ డదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎవరైనా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా, ఘర్షణలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో నమోదు చేసే కేసుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.