బాధితులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు పరామర్శ

అనకాపల్లి, మహానాడు: అచ్యుతాపురం ఘటన బాధితులను, వారి కుటుంబాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు గురువారం పరామర్శించారు. అనకాపల్లి ఉషాప్రైమ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు, వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అచ్చుతాపురం సేజ్ లో జరిగిన ఫార్మా ప్రమాదం దురదృష్టకర సంఘటన అని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలలో మూడు నెలలకు ఒక్కసారి ఆడిట్ జరగాలని సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా సేఫ్టీ మెథడ్స్ పై ప్రత్యేక దృష్టి సారించి కఠినమైన నిబంధనలు అమలు చేసేలా చర్యలు చేపడతామని చెప్పారు.