-బాబుతో అయ్యన్న భేటీ
అమరావతి: ఏపీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నియమితులు కానున్నట్లు సమాచారం. మంత్రివర్గంలో స్థానం కోల్పోయిన పాత్రుడుకు స్పీకర్ పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అటు పార్టీ క్యాడర్ సైతం.. విపక్షంలో ఉన్నప్పడు జగన్ సర్కారుపై పోరాడి, వేధింపులకు గురైన అయ్యన్నకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమయింది. కాగా తాజాగా అయ్యన్నను సీఎం చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. నేడో, రేపో అయ్యన్న పేరు స్పీకర్ పేరు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.