శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు

– ఈవో చంద్రశేఖర్‌ రెడ్డి

శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో జరుగనున్న కార్తీక మాసోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈవో చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు. వచ్చే యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పార్కింగ్‌ సమస్యపై దృష్టిని సారించాలని అన్నారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి ఈవో ప్రధాన పార్కింగ్‌ స్థలాలను పరిశీలించారు. విచ్చేసే భక్తుల కోసం ఆర్టీసీ బస్టాండ్‌, ప్రభుత్వ పాఠశాల ఆవరణ, ఘంటామఠం ప్రాంతం, టూరిస్ట్‌ బస్టాండ్‌తోపాటు, వలయ రహదారిపై కూడా వాహనాలు నిలుపుకొనేందుకు ఏర్పాట్లు చేయనున్నామని వివరించారు.