– ఎమ్మెల్యే సత్యానందరావు
ప్రజల సమస్యలకు సరైన పరిష్కార వేదిక ప్రజాదర్బార్ అని, వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట పంచాయితీ కార్యాలయంలో సత్యానందరావు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రతి సోమవారం ప్రజలను కలుసుకుని సమస్యల వినతులు స్వీకరించి వారిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రజాదర్బార్ కు 403 వినతులు వచ్చాయని తెలిపారు. ప్రజలు ఇచ్చిన సమస్యల వినతులు పరిష్కారం అయ్యే వరకు వాటిపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని సత్యానందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూసి జయలక్ష్మి భాస్కరరావు, కంఠంశెట్టి శ్రీనివాస్, పాలూరి సత్యానందం, ముత్యాల బాబ్జి, యల్లమెల్లి జగన్మోహన్, రెడ్డి రామకృష్ణ, కంఠంశెట్టి చంటి, బీర ఇస్సాక్, రెడ్డి తాతాజీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.