- కార్యకర్తల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ లక్ష్యం
- అందుకు ఎనలేని కృషి చేస్తున్నారు
- తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జుజ్జూరులో విశేష స్పందన లభించింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం జుజ్జూరు లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యకర్తల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ లక్ష్యమన్నారు. అందుకు వారు ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. టీడీపీ బీమా సభ్యత్వ నమోదు కార్యకర్తల జీవితానికి భరోసా అని తెలిపారు. వంద రూపాయలు చెల్లించిన సభ్యత్వం తీసుకోవాలన్నారు. సభ్యత్వ నమోదు చేసుకున్న ప్రతి కార్యకర్తకు రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తిసుందన్నారు. విద్య, ఉపాధి కోసం పార్టీ సహాయాన్ని అందిస్తుందన్నారు. ప్రతీ క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జులు, నియోజకవర్గ ముఖ్య నేతలు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అత్యధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయించాలన్నారు. టీడీపీ అభిమానులు, మద్దతుదారులు సభ్యత్వ నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.