గుంటూరు: భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక డొంక రోడ్డులో వేంచేసియున్న శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గం నాలుగో మండల ప్రధాన కార్యదర్శి పెద్దింటి శ్రీకృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఆలయంలో సీతారామాంజనేయ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామివార్లకు భారత ప్రధాని ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ శత వసంతాలు పూర్తి చేసుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర నాయకుడు, గుంటూరు జిల్లా సభ్యత్వ ప్రముఖ్ పాలపాటి రవికుమార్ మాట్లాడారు.
మోడీ హయాంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని, అంతర్జాతీయంగా భారత కీర్తిప్రతిష్ఠలు ఉన్నత శిఖరాలకు చేరుకున్నయాన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెరుకూరి తిరుపతిరావు, రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్, నాలుగో మండల కార్యదర్శి వక్కలగడ్డ తిరుమలరావు, సీనియర్ నాయకుడు బజరంగ్ రామకృష్ణ, మందలపు సురేష్ చౌదరి, వెంకటరమణ కె.సునీత, తదితరులు పాల్గొన్నారు.