కూటమి ప్రభుత్వ హయాంలోనే క్రీడాభివృద్ధి

– పూతలపట్టు శాసన సభ్యుడు మురళీమోహన్

పూతలపట్టు, మహానాడు: పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 68వ రాష్ట్ర స్ధాయి అండర్ -17 కుస్తీ పోటీలను పూతలపట్టు శాసన సభ్యుడు డాక్టర్ కలికిరి మురళీమోహన్ శనివారం ప్రారంభించారు. యాదమరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న కుస్తీ పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడాభివృద్దికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు.

క్రీడాకారుల పట్ల‌ బాధ్యతతో వారిని ప్రోత్సహిస్తోందని గుర్తు చేశారు. యాదమరి మండలానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న అధికారులను, నాయకులను ఆయన అభినందించారు. విద్యార్ధులకు క్రీడాలు చాలా అవసరమని, యాదమరి మండలంలో జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకునే క్రీడాకారులు ఉన్నారని తెలిసిందన్నారు. వెంటనే యాదమరిలో క్రీడా పోటీలు నిర్వహించేందుకు అవకాశం లేకపోయినా చొరవ చూపి రెజ్లింగ్ పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదమరి మండల అధ్యక్షులు మురార్జీ యాదవ్, నాయకులు అమరనాథ్ నాయుడు, చిత్రా నాయుడు, చిట్టిబాబు నాయుడు, మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు, విద్యార్ధులు పాల్గొన్నారు.