ఏ సమస్యలు ఉన్నా నా వద్దకు రండి

– పల్నాడు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు

నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లా ఎస్పీగా కంచి శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…

చరిత్రాత్మకమైన పల్నాడు జిల్లాకు రావడం సంతోషం. ఎన్నికల తరువాత పల్నాడులో అనేక సమస్యలు వచ్చాయి. గతంలో ఉన్న ఎస్పీ వాటిని సమర్ధవంతంగా పరిష్కారించారు. నేను కూడా జిల్లాలోని పరిస్థితులను తొందరగా అవగాహన చేసుకుని చట్టపరంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తాను. చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. జిల్లాలో తప్పుడు కేసులు బనాయించకుండా చూసేoదుకు కృషి చేస్తామన్నారు.

ముఖ్యంగా జిల్లాలో మహిళలకు రక్షణ కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాo. యాంటీ డ్రగ్స్ పై జిల్లాలో 100 రోజులు క్యాంపెన్ చేస్తాము. గంజాయి విక్రయాలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టడతాం. అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వాటిని ఆధారాలతో, అవసరమైతే ఇతర శాఖలతో కలిసి ముందుకెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రజలు ఏ సమస్యలు ఉన్నా తమ వద్దకు వచ్చి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అనవసరమైన ఘర్షణలకు పాల్పడి తమ జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. పల్నాడు పోలీసులు ప్రజలకు సేవలందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని భరోసా ఇచ్చారు.