– సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు
మంగళగిరి: డబ్బుకు ఓటును అమ్ముకోవద్దని చెప్పాల్సిన ఎస్‌ఐ తన ఓటు అమ్ముకుని సస్పెండ్ అయ్యారు. మంగళగిరి టౌన్ ఎస్సై ఖాజా బాబుకు ప్రకాశం( డి ) కురిచేడులో ఓటు ఉంది. ఎస్‌ఐ తో ఓటు వేయిస్తామని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి రూ.5వేలు తీసుకుని.. ఎస్‌ఐ కి ఆన్లైన్లో పంపారు. ఆ తర్వాత డబ్బులు పంచుతూ సదరు నాయకుడు పోలీసులకు చిక్కాడు. విచారణలో ఎస్‌ఐ కి నగదు పంపినట్లు తేలింది. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.