టీడీపీతోనే సుస్థిర పాలన్ణ

.. కోట్ల జయ సూర్యప్రకాశ్‌ రెడ్డి

ప్యాపిలి, మహానాడు :ప్యాపిలి మండలంలోని వెంకటాపురం గ్రామంలో టీడీపీ, జనసేన బీజెపీ ఉమ్మడి అభ్యర్థి కోట్ల జయ సూర్యప్రకాశ్‌ రెడ్డి డోర్‌ టు డోర్‌ ఎన్నికల ప్రచారం బుధవారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి కోట్ల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి గ్రామములో మంచి నీటి సమస్య, గ్రామాలలో సీసీ రోడ్లు డ్రైనేజీ పూర్తి చేయగలమని ప్రజలకు భరోసా ఇచ్చారు.

మీరందరూ సైకిల్‌ గుర్తుపై ఓటు వేస,ి వేయించి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు విరివిగా పాల్గొన్నారు.