స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలి

– స్పీకర్‌ ను కోరిన కాంట్రాక్టు సిబ్బంది

నర్సీపట్నం, మహానాడు: జీవో నెంబర్ 115ను రద్దు చేయాలని, 15 ఏళ్ళుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్థానిక ఏరియా ఆసుపత్రిలోని నర్సులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి వినతిపత్రం అందజేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సానుకూలంగా స్పందించి, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబుతో ఫోన్లో మాట్లాడారు. కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల సమస్యలపై యూనియన్ ప్రెసిడెంట్ ను కృష్ణ బాబుని కలవాలని సూచించారు. ఈ పరిణామంపై కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం, కోటవురట్ల, రోలుగుంట, మాకవరపాలెం, నాతవరం సీహెచ్‌ఎస్సీ, పిహెచ్‌సీ కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు.