నరసరావుపేట, మహానాడు: ప్రముఖ సాహితీవేత్త ఆర్వీఆర్ కాలేజీ అధ్యాపకురాలు, ప్రధానోపాధ్యాయిని, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి, శ్రీ శ్రీ కళా వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి రాజ్యలక్ష్మి కి శనివారం విఆర్ రావు సిద్ధార్థ కళాశాల, విజయవాడలో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రాస్పరిటీస్ ఎడ్యుకేషన్ అసోసియేషన్(ఏపీఎంపీఏ) వారి నిర్వహణలో, ఏపీఎంపీఏ అధ్యక్షుడు డాక్టర్ బి.రమేష్ ఆధ్వర్యంలో శ్రీ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని ఉత్తమ అధ్యాపకులకు 2023-24 సంవత్సరానికి రాష్ట్ర స్థాయి బెస్ట్ టీచర్ ఎడ్యుకేటర్ ప్రతిభా పురస్కారాలు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరీక్షా నిర్వహణ డైరెక్టర్ డి.దేవేందర్ రెడ్డి, ఆంధ్ర కేసరి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు, డీన్ ఫ్యాకల్టీ ఎడ్యుకేషన్ ఇన్ నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ స్వరూప, కృష్ణ యూనివర్సిటీ ఎస్పీఎమ్హెచ్ కళాశాల ప్రిన్సిపాల్ వి.వి.శైలజ, ఆర్వీ ఆర్ ఆర్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ ఎం.రవి కుమార్, వైవీరావు సిద్ధార్థ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ శేష శ్రీ, గవర్నమెంట్ డైట్ కాలేజీ విశ్రాంత ప్రిన్సిపాల్ ఎంవీజి ఆంజనేయులు, వివిధ విద్యా సంస్థల అధినేతలు, వివిధ విభాగాల అధ్యాపకులు, ఎడ్యుకేషనల్ స్కాలర్స్ పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ అధ్యాపక అవార్డ్ అందుకున్న సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గ ఎంపీ శ్రీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, కనుమూరి రాజ్యలక్ష్మి ని అభినందించారు.