ప్రకాశం కలెక్టర్‌కు కూటమి నేతల వినతి
ఒంగోలు: కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు ఒంగోలు కలెక్టర్ దినేష్ కుమార్ ను కలసి వినతిపత్రం ఇచ్చారు. ఒంగోలు కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు విజయకుమార్ దర్శి గొట్టిపాటి లక్ష్మి,లలిత్ సాగర్‌లు కలెక్టర్ గారిని కలిసిన వారిలో ఉన్నారు. కౌంటింగ్‌లో వైసీపీ దౌర్జన్యాలు, దాడులకు తెగబడకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని కోరారు.