ముంపు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలి

– అధికారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన

రాజమహేంద్రవరం : స్థానిక 11వ డివిజన్లో నెలకొన్న సమస్యలకు సత్వరం పరిష్కారం చూపించాలని నగర పాలక సంస్థ అధికారులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాన్ (వాను) ఆదేశించారు. సదరు డివిజన్లో గతంలో చేపట్టిన మేజర్ డ్రైనేజీని స్థానిక టీడీపీ నాయకులు, నగర పాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సదరు ప్రాంతంలో ముంపు, మురుగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు.

డ్రైనేజీల్లో పేరుకుపోయిన సిల్టును వెంటనే తీయించాలని, ఇంకా మిగిలిపోయిన పెండింగ్ పనులను సత్వరం పూర్తి చేసి స్థానిక ప్రజలకు డ్రైనేజీ పరంగా ఎలాంటి సమస్య లేకుండా చూడాలన్నారు. స్థానిక పెద్దలు అంకం గోపి, డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్రప్రసాద్, అడబాల రాజా, రేగేటి నూరిబాబు, జాజుల గోవిందరాజులు, తోట కిరణ్, సత్యవేణి, రేలంగి శ్యామ్, గరికి రామారావు, నున్న నాగమణి, దేవి, బద్రి, కేబుల్ ప్రభాకర్, కోర్పు రామారావు, భవానీ, బాబురావు తదితరులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెంట ఉన్నారు.