-ఫేక్ ఖాతాలు సృష్టించి నగదు మళ్లింపు
-మార్కెట్ యార్డ్‌లో కంప్యూటర్ ఆపరేటర్ నిర్వాకం
-వ్యవసాయశాఖలో రూ.3.72 కోట్ల స్వాహా
-నోరుమెదపని పెడన వ్యవసాయాధికారి
-వైసీపీ నేతలతో కలిసి కుంభకోణంపై అనుమానం
-కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన
పెడన, మహానాడు: కృష్ణా జిల్లా పెడనలో న్యూట్రిషన్ చేసుకునే వ్యక్తి వ్యవసాయ శాఖ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తూ రూ.3.72 కోట్లు స్వాహా చేసిన ఘటన వెలు గులోకి వచ్చింది. అయితే వ్యవసాయాధికారి తెలిసి కూడా నోరు మెదపకపోవడం తో ఆయనతో పాటు వైసీపీ నేతల పాత్ర ఏమైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఫేక్ అకౌంట్లు సృష్టించి సుమారు రూ.3 కోట్ల పైనే గోల్‌మాల్ చేసినట్లు సమాచారం. కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి జాబ్ ఎవరిచ్చా రు అన్న ప్రశ్న తలెత్తుతుంది.
ఫేక్ ఖాతాలు సృష్టించి…
పెడన మండలం మార్కెట్ యార్డ్‌లో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ కంప్యూటర్ ఆపరేటర్ తన బంధువులు, స్నేహితులు తదితరుల ఆధార్ కార్డులు, బ్యాంకు అకౌంట్లు జిరాక్స్ తీసుకుని గత వర్షాలకు పంట నష్టపో యిన రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చిన నష్టపరిహారం ఫేక్ ఖాతాల్లో వేశారు. రైతులకు పడాల్సిన నష్టపరిహారం ఫేక్ అకౌంట్లలో పడే విధంగా ఏర్పాటు చేసుకు న్నారు. అయితే దీని వెనుక వ్యవసాయాధికారి ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది రైతులు ఏవో ఎదుట ఆందోళన కూడా చేశారు. చిన్న, సన్న కారు రైతులకు నష్టపరిహారం ఎకరాకు రూ.6 వేలు, కొంతమందికి రూ.8 వేలు, మరి కొంతమందికి రూ.32 వేల నుంచి లక్ష వరకు పడినట్లు సమాచారం.
బల్లిపరు ఆర్‌బీకే పరిధిలో ఆపరేటర్
పెడన మండలంలో రైతుల ఆధార్, బ్యాంకు అకౌంట్ నెంబర్లను వ్యవసాయ శాఖ ఆర్బీకే సిబ్బంది సేకరించి ఆన్‌లైన్ చేశారు. 6,732 మందికి పంట నష్టపరిహారం కింద రూ.6,80,60,000 కోట్లు మంజూరయ్యాయి. బల్లిపరు ఆర్‌బీకే ఆధ్వర్యం లో ఉన్న సింగరాయపాలెం గ్రామానికి చెందిన యార్లగడ్డ నాగమల్లేశ్వరరావు కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తూ ఈ స్కామ్‌కు పాల్పడినట్టు సమాచారం. అతని దగ్గర నుంచి ఈ స్కామ్‌కు సంబంధించిన నగదును స్వాధీనం చేసుకుంటామని ఏవో శ్రీనివాసరావు చెబుతున్నారు.
ఏవో, వైసీపీ నేతల హస్తం
దీని వెనుక వ్యవసాయాధికారితో పాటు వైసీపీకి చెందిన పెడన పట్టణ కౌన్సిలర్‌తో పాటు, మరి కొంతమంది నాయకులు ఉన్నట్లు సమాచారం. ప్రతిరోజు వ్యవసా య శాఖ కార్యాలయానికి వచ్చి ఏవో శ్రీనివాసరావుతో వైసీపీ నాయకులు మంత నాలు చేస్తున్నారు. దీని వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారనేది కూడా సమాచారం తెలియాల్సి ఉంది. 3 కోట్ల 72 లక్షలు ఫేక్ అకౌంట్లలో డబ్బులు పడ్డాయని రైతు లు వ్యవసాయ కార్యాలయం వద్ద ఆందో ళనకు దిగారు. దీనిపైన పూర్తి దర్యాప్తు చేసి ఏవో శ్రీనివాసరావు, నాగమల్లేశ్వరరావు, పాత్ర ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.