వరద ముప్పు లేకుండా పటిష్ఠ డ్రైనేజీలు

– ఎమ్మెల్యే కొలికపూడి

తిరువూరు, మహానాడు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని చింతలకాలనీలోని ముప్పు ప్రాంతాలను, మధిర రోడ్డులో డ్రైనేజీలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆదివారం పరిశీలించారు. చింతలకాలనీలో యుద్ధప్రాతిపదికన జెసీబీ సహాయంతో నీటిని బయటకు పంపే ఏర్పాటు చేయించారు. లోతట్టు ప్రాంతాల కాలనీల్లోని కొన్ని కుటుంబాలను స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి తరలించినట్టు తెలిపారు. డ్రైనేజీల్లో పూడికలను ఎమ్మెల్యే స్వయంగా పార పట్టుకొని తీవారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో ఏమన్నారంటే.. బాధితులకు రెండు, మూడు రోజులపాటు తాత్కాలిక పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వారికి భోజనం అన్ని సౌకర్యాలను కల్పించనున్నాం.. రాబోయే రోజుల్లో తిరువూరు పట్టణంలో పటిష్ఠ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.