ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకుని…బైక్‌పై ప్రత్తిపాటి

కార్యకర్త వాహనంపై వేదిక దగ్గరకు…
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరు

గన్నవరం: కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి మూడు పార్టీల శ్రేణులు లక్షలాదిగా పోటెత్తారు. భారీ సంఖ్యలో వాహనాల్లో తరలివచ్చారు. దీంతో జాతీయ రహదారిపై విపరీతమైన రద్దీ ఏర్పడిరది. భారీ వాహనాలు ముందుకు కదిల్లేని పరిస్థితి నెలకొంది. గన్నవరం హైవే పరిసరాలు స్తంభించడంతో మాజీమంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వేదిక వద్దకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఎటూ కదల్లేని ఆ పరిస్థితుల్లో కారులో నుంచి దిగి వేదిక దగ్గరకు చేరుకోవడానికి సాహసయాత్రనే చేశారు. కార్యకర్తకు చెందిన ద్విచక్ర వాహనంపై సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. అప్పటికే ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకార ఘట్టం ముగియడంతో అందరికీ శుభాకాంక్షలు తెలిపి వెనుదిరిగారు. అయితే ఇదే సమయంలో ఆయన బైక్‌ ప్రయాణం దృశ్యాలు వైరల్‌గా మారాయి.