నరసరావుపేట, మహానాడు: స్థానిక హార్డ్ హైస్కూల్ లో విద్యార్థిని ఆత్మహత్య సంఘటన చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న పల్లపు జయలక్ష్మి (14) తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని జయలక్ష్మి స్వగ్రామం రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.