విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

– ఎమ్మెల్యే మాధవి

గుంటూరు, మహానాడు: ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత పెరిగిపోతోందని, ప్రపంచంతో పోటీగా స్థానిక విద్యార్థులు కూడా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కోరారు. శుక్రవారం 32వ డివిజన్ శారదానికేతన్ స్కూల్ లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో డిజిటల్ క్లాసెస్ కొరకు ఎల్ఈడి టీవీలు అందజేసే కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యారులు అందరూ కష్టపడి బాగా చదువుకోవాలని, జీవితాల్లో వెలుగులు నిండాలి అంటే ఒక విద్యతోనే సాధ్యమని గళ్ళా మాధవి తెలిపారు.

ఇప్పుడు మొత్తం డిజిటల్ మారిపోయిందని, రాబోయే కాలం మొత్తం డిజిటల్ యుగంగా మారిపోతుందన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదని, వీటికి అనుగుణంగా విద్యార్థుల కోసం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో డిజిటల్ క్లాసెస్ కొరకు ఎల్ఈడి టీవీలు అందజేయటం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్మాలపాటి శ్రీనివాసరావు, అయినవోలు బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.